Ian Botham on IPL: ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఎవరు చూస్తారు.. అంతా ఐపీఎల్లే కదా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్-ian botham on ipl says no one watches test cricket in india they only watch ipl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ian Botham On Ipl: ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఎవరు చూస్తారు.. అంతా ఐపీఎల్లే కదా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Ian Botham on IPL: ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఎవరు చూస్తారు.. అంతా ఐపీఎల్లే కదా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Hari Prasad S HT Telugu
Feb 03, 2023 12:54 PM IST

Ian Botham on IPL: ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఎవరు చూస్తారు? అందరూ ఐపీఎల్ వెంట పడ్డారు అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ ను పట్టించుకోకపోతే క్రికెట్ బతకదని అతడు అన్నాడు.

ఇయాన్ బోథమ్
ఇయాన్ బోథమ్

Ian Botham on IPL: ఇండియాలో టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని అన్నాడు ఇంగ్లండ్ ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ బోథమ్. ఆ దేశంలో మొత్తం ఐపీఎల్ హవానే నడుస్తోందని అనడం గమనార్హం. "ఇండియాకు వెళ్లి చూడండి. అక్కడ ఎవరూ టెస్ట్ క్రికెట్ ఎవరూ చూడరు. అంతా ఐపీఎల్లే. దాంతో భారీగా డబ్బు సంపాదించారు. ఇప్పుడది బాగానే అనిపిస్తుంది. కానీ అది ఎన్నాళ్లు సాగుతుందని వాళ్లు భావిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ 100 ఏళ్లకుపైగా ఉంది. ఇంకా చాలా కాలం ఉంటుంది కూడా" అని బోథమ్ అన్నాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ముందు మిర్రర్ స్పోర్ట్ తో మాట్లాడిన బోథమ్.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "టెస్ట్ క్రికెట్ ను మనం కోల్పోతే మనకు తెలిసిన క్రికెట్ కనుమరగవుతుంది. అది అర్థరహితం అవుతుంది. ప్రతి ప్లేయర్ టెస్టు క్రికెట్ ఆడాలని అనుకోవాలి" అని బోథమ్ చెప్పాడు. ఇక ఈ ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్ గురించి కూడా అతడు స్పందించాడు.

ఈసారి ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుందని కూడా బోథమ్ అంచనా వేశాడు. బజ్‌బాల్ క్రికెట్ ఇంగ్లండ్ జట్టును పూర్తిగా మార్చేసిందని అభిప్రాయపడ్డాడు. ఈ బజ్‌బాల్ స్టైల్ క్రికెట్ కొనసాగుతుందని కూడా చెప్పాడు. "ఈ స్టైల్ క్రికెట కొనసాగుతుంది. వాళ్లు కేవలం 10 మ్యాచ్ లు మాత్రమే ఆడారు. అందులో 9 గెలిచి, ఒకటి ఓడిపోయారు. అలా ఆడితే ఎప్పుడో ఒకసారి ఓడిపోతుంటారు. అది తప్పదు. కానీ టెస్ట్ క్రికెట్ కు అది అవసరం. పాకిస్థాన్ లో 3-0 తో గెలవడం గొప్ప విషయం. పాకిస్థాన్ అంత సులువుగా సొంతగడ్డపై 0-3తో ఓడిపోదు" అని బోథమ్ అన్నాడు.

"వాళ్లు అలాగే ఆడుతారని అనుకుంటున్నాను. డ్రెస్సింగ్ రూమ్ లోనే అలా ఆడాలని నిర్ణయించుకుంటున్నారు. వాళ్లు సానుకూలంగా ఉంటూ గెలవాలని అనుకుంటున్నారు. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ అలాగే కనిపిస్తున్నారు. ఇదే సరైన మార్గం అని నేను భావిస్తున్నాను" అని బోథమ్ అభిప్రాయపడ్డాడు.

WhatsApp channel

సంబంధిత కథనం