Dravid leaves Team India: ద్రవిడ్‌కు ఏమైంది.. టీమిండియాను వదిలి బెంగళూరు వెళ్లిన హెడ్‌ కోచ్‌-dravid leaves team india for bangalore due to some health reasons ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Dravid Leaves Team India For Bangalore Due To Some Health Reasons

Dravid leaves Team India: ద్రవిడ్‌కు ఏమైంది.. టీమిండియాను వదిలి బెంగళూరు వెళ్లిన హెడ్‌ కోచ్‌

బెంగళూరు వెళ్లే ఫ్లైట్ లో రాహుల్ ద్రవిడ్
బెంగళూరు వెళ్లే ఫ్లైట్ లో రాహుల్ ద్రవిడ్ (Twitter/@batchumalli)

Dravid leaves Team India: ద్రవిడ్‌కు ఏమైంది అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. టీమిండియా హెడ్‌ కోచ్‌ టీమ్‌ను వదిలి బెంగళూరు వెళ్లాడు. ఆరోగ్య సమస్యల కారణంగా అతడు టీమ్‌ను వీడినట్లు వార్తలు వస్తున్నాయి.

Dravid leaves Team India: టీమిండియా ఇప్పటికే శ్రీలంకపై వన్డే సిరీస్‌ను గెలిచిన విషయం తెలుసు కదా. గురువారం (జనవరి 12) కోల్‌కతాలో రెండో వన్డే జరిగిన తర్వాత శుక్రవారం (జనవరి 13) ఉదయమే హెడ్‌ కోచ్ రాహుల్‌ ద్రవిడ్ టీమ్‌ను వదిలి బెంగళూరు వెళ్లాడు. కోల్‌కతా నుంచి ఒంటరిగానే బెంగళూరు ఫ్లైటెక్కాడు. అతడు ఫ్లైట్‌లో ఉన్న ఫొటోలను ఓ అభిమాని ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆరోగ్య కారణాల వల్లే అతడు బెంగళూరు వెళ్లినట్లు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. రెండో వన్డే జరుగుతున్న సమయంలో ద్రవిడ్‌కు రక్తపోటు సమస్యలు ఎదురయ్యాయని, స్థానిక క్రికెట్ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ డాక్టర్లు అతన్ని పరీక్షించినట్లు తెలిసింది. అయితే ద్రవిడ్‌ ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని, ఆదివారం మూడో వన్డేకు జరగడానికి ముందు శనివారమే ద్రవిడ్‌ టీమ్‌తో చేరనున్నట్లు మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది.

బుధవారమే (జనవరి 11) ద్రవిడ్‌ తన 50వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. బీపీకి సంబంధించిన సమస్యలు కావడంతో బెంగళూరులో తనను రెగ్యులర్‌గా చూసే డాక్టర్ల సలహా తీసుకొని, కొన్ని టెస్టులు చేయించుకునే అవకాశం ఉంది. శ్రీలంకతో మూడో వన్డే ఆదివారం (జనవరి 15) త్రివేండ్రంలో జరగనుంది.

ఈ సిరీస్‌ ముగిసిన వెంటనే ఇండియన్‌ టీమ్‌ న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే ఈ నెల 18న హైదరాబాద్‌లో జరగనుంది. 15న శ్రీలంకతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత 16న ఇండియన్‌ టీమ్‌ హైదరాబాద్‌ రానుంది.

సంబంధిత కథనం