Telugu News  /  Sports  /  Dinesh Karthik Says Kuldeep Yadav As A Good Weapon In Overseas Tests
దినేశ్ కార్తిక్
దినేశ్ కార్తిక్ (AFP)

Dinesh Karthik About Kuldeep: అతడు విదేశాల్లో భారత్‌కున్న అస్త్రం.. ఆ స్పిన్నర్‌పై దినేశ్ కార్తిక్ ప్రశంసలు

15 December 2022, 21:20 ISTMaragani Govardhan
15 December 2022, 21:20 IST

Dinesh Karthik About Kuldeep: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాతో అతడి ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. విదేశాల్లో భారత్‌కు మంచి అస్త్రమవుతాడని స్పష్టం చేశాడు.

Dinesh Karthik About Kuldeep: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ముందు తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తే.. అనంతరం కుల్దీప్ యాదవ్ తన మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. సిరాజ్ 3 వికెట్లతో విజృంభించగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో దుమ్మురేపాడు. దీంతో సర్వత్రా బౌలర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తిక్ స్పందించాడు. అతడు రాబోయే సిరీస్‌ల్లో భారత్‌కు మంచి స్పిన్ అస్త్రం అవుతాడని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

నాకు తెలిసి కుల్దీప్ తన రెండో బంతిని షకిబుల్‌ను ఔట్ చేయడం మ్యాచ్‌లో కీలకం. షకిబుల్ స్పిన్నర్లను బాగా ఆడతాడు. వాళ్లను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. బంతి కొంచెం ముందుగానే డిప్ కావడంతో అతడు రాంగ్ షాట్ ఆడేలా చేసింది. ఫలితం అతడు పెవిలియన్ చేరాడు. అది నిజంగా మంచి బౌలింగ్. కుల్దీప్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అని దినేశ్ కార్తిక్ అన్నాడు.

షకిబుల్‌ను ఔట్ చేసినప్పటి నుంచి కుల్దీప్‌లో ఫుల్ ఫ్లోను చూడవచ్చు. అతడు మంచి బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో ఆడటానికి చాలా కష్టపడ్డారు. ఇది చాలా మంచి పరిణామం. విదేశాల్లో అతడు బాగా ఉపయోగపడతాడు. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌కు అతడు మంచి ఆయుధంగా మారతాడు. అని దినేశ్ కార్తిక్ అన్నాడు.

కుల్దీప్ తను వేసిన రెండో బంతికే షకిబుల్‌ను ఔట్ చేశాడు. అతడు బంతిని సరిగ్గా అంచనా వేయలేక స్లిప్పులో ఉన్న విరాట్ కోహ్లీకి క్యాచ్ అచ్చాడు. అప్పటికీ బంగ్లా స్కోరు 75/5గా ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది. సిరాజ్ 3 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో విజృంభించాడు. నురుల్ హసన్(16), ముష్ఫీకర్ రహీమ్(28) క్రీజులో ఉన్నారు.