Childhood coach on Rohit Sharma: రోహిత్‌ చేస్తున్న తప్పును ఎత్తి చూపిన చిన్ననాటి కోచ్‌ దినేష్‌-childhood coach on rohit sharma says he is playing high risk game and he should not do that ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Childhood Coach On Rohit Sharma: రోహిత్‌ చేస్తున్న తప్పును ఎత్తి చూపిన చిన్ననాటి కోచ్‌ దినేష్‌

Childhood coach on Rohit Sharma: రోహిత్‌ చేస్తున్న తప్పును ఎత్తి చూపిన చిన్ననాటి కోచ్‌ దినేష్‌

Hari Prasad S HT Telugu
Oct 26, 2022 08:34 PM IST

Childhood coach on Rohit Sharma: రోహిత్‌ చేస్తున్న తప్పును ఎత్తి చూపాడు చిన్ననాటి కోచ్‌ దినేష్‌ లాడ్‌. అతడు బ్యాటింగ్‌లో పదేపదే విఫలమవుతుండటంపై దినేష్‌ స్పందించాడు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (PTI)

Childhood coach on Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీలో ఇండియన్‌ టీమ్‌ వరుస విజయాలు సాధిస్తున్నా.. ఇప్పటికీ అతని బ్యాటింగ్‌ వైఫల్యాలు టీమ్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌పై కీలకపాత్ర పోషించాల్సిన సమయంలో అతడు చేతులెత్తేశాడు. 7 బాల్స్‌లో కేవలం 4 రన్స్‌ మాత్రమే చేశాడు.

అయితే రోహిత్‌ బ్యాటింగ్ చేస్తున్న విధానంపై అతని చిన్ననాటి కోచ్‌ దినేష్‌ లాడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు తప్పు ఎక్కడ చేస్తున్నాడో దినేష్‌ ఎత్తి చూపాడు. "రోహిత్‌ కొన్నాళ్లుగా హైరిస్క్‌ గేమ్‌ ఆడుతున్నాడు. అతడు అలా ఆడకూడదు. అతడు అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. మరీ దూకుడుగా ఆడుతూ రోహిత్‌ తప్పు చేస్తున్నాడని అనిపిస్తోంది" అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేష్‌ చెప్పాడు.

"రోహిత్‌ క్రీజులో ఎక్కువ సమయం గడపాలి. తన వికెట్‌ పారేసుకోకూడదు. పవర్‌ ప్లే తొలి ఆరు ఓవర్లలో అతడు ఎక్కువ ఛాన్స్‌లు తీసుకోవద్దు. అతడు తన సహజమైన ఆట ఆడాలి. అతడు ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం 17-18 ఓవర్ల వరకూ ఆడి 70-80 రన్స్‌ చేయడానికి ప్రయత్నించాలి" అని దినేష్‌ లాడ్‌ అన్నాడు.

ఇక వరల్డ్‌కప్‌కు ముందు తాను రోహిత్‌తో మాట్లాడినట్లు కూడా దినేష్‌ వెల్లడించాడు. అతనితో అప్పుడు ఏం మాట్లాడానో వివరించాడు. క్రీజులోనే ఉండి ఆడాల్సిందిగా అతనికి సూచించానని, అయితే రోహిత్‌ మాత్రం తన వికెట్‌ పారేసుకుంటున్నాడని దినేష్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

"వరల్డ్‌కప్‌ కంటే ముందు అతనితో మాట్లాడాను. మేము టెక్నిక్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఎందుకంటే అతడు ఇప్పటికే ఇండియాకు ఎంతో క్రికెట్‌ ఆడాడు. అయితే క్రీజులోనే ఉండి జాగ్రత్తగా ఆడాలని సూచించాను. ఇండియా విజయంలో అతడు ముందు నిలవాలని ఎప్పుడూ కోరుకుంటాను.

కానీ అతడు మాత్రం క్రీజులో గడపకుండా వికెట్‌ పారేసుకుంటున్నాడు" అని దినేష్‌ అన్నాడు. కొన్నిసార్లు చెత్త షాట్లు ఆడి వికెట్‌ పారేసుకుంటుండటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని కూడా రోహిత్‌ చిన్ననాటి కోచ్‌ అభిప్రాయపడ్డాడు.

WhatsApp channel