Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలితాలు.. వీరు దుర్గా దేవికి దీపం వెలిగించాలి-today rasi phalalu in telugu check vedik astrological predictions for tuesday may 30 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu In Telugu Check Vedik Astrological Predictions For Tuesday May 30 2023

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలితాలు.. వీరు దుర్గా దేవికి దీపం వెలిగించాలి

HT Telugu Desk HT Telugu
May 30, 2023 01:00 AM IST

today rasi phalalu: ఈరోజు రాశి ఫలాలు మే 30, 2023వ తేదీ మంగళవారం కోసం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

పలు రాశుల జాతకులు నేడు దుర్గా దేవికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలని సూచన
పలు రాశుల జాతకులు నేడు దుర్గా దేవికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలని సూచన

ఈరోజు రాశి ఫలితములు (దిన ఫలాలు) 30.05. 2023

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టం

వారం: మంగళవారం, తిథి: శు. దశమి నక్షత్రం: హస్త

మేషరాశి ఫలాలు

మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. శారరీక శ్రమ అధికము. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదని సూచన. మేషరాశికి జన్మస్థానం నందు బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానం నందు రవి ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. పనులు యందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి వారు శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్యేశరుణ్ణి పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి ఫలాలు

వృషభరాశి జాతకులకు ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదముగా గడిపెదరు. పనులను సకాలంలో పూర్తి చేసెదరు. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన.

వృషభ రాశి జాతకులు సానుకూల ఫలితాల కోసం దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి ఫలితాలు

మిథునరాశి జాతకులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. శ్రమ అధికముగా ఉండును. కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్‌ స్థానము నందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్చడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుట చేత మిథునరాశివారికి కలసివచ్చును.

మిథునరాశి జాతకులు ఈరోజు చక్కటి ఫలితాల కోసం విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

కర్కాటక రాశి ఫలితాలు

కర్కాటక రాశివారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆగ్రహ ఆవేశాలు నియంత్రించుకోవాలి. శ్రమ అధికముగా ఉండును. ఒత్తిళ్ళు పెరుగును. జన్మరాశి యందు కుజుని ప్రభావం చేత శారీరక శ్రమ అధికముగా ఉందును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన.

నేడు కర్కాటక రాశి జాతకులు బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహరాశి ఫలాలు

నేడు సింహ రాశి వారికి జాతక చక్రం అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. శ్రమకు తగిన ఫలితము లభించును. మానసికంగా ఉల్లాసంగా ఉందెదరు. లాభ స్థానములో శుక్రుడు, దశమస్థానములో రవి ప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశి వారికి చేసే ప్రతి పని అనుకూలించును.

సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యారాశి ఈరోజు ఫలితాలు

కన్యా రాశి వారికి ఈరోజు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ధనలాభము కలుగును. మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు.

దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

తులారాశి నేటి ఫలాలు

తులా రాశి జాతకులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు అధికమగును. చర్చలకు దూరంగా ఉండాలి. ఆవేశాన్ని తగ్గించుకోవాలని సూచన. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శమ అధికముగా ఉండును. దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధిగమించి ముందుకు వెళతారు.

తులారాశి జాతకులు నేడు విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

వృశ్చికరాశి ఫలాలు

వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఒత్తిళ్ళు అధికముగా ఉన్నాయి. కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును.

బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూరాశి ఈరోజు ఫలితాలు

ధనూరాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. అష్టమ కుజుని ప్రభావం చేత కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడు సూచన. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానం నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు.

ధనుస్సు రాశి జాతకులు నేడు సుబ్రహ్మణ్యేశరుణ్ణి పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకరరాశి నేటి ఫలితాలు

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఖర్చులు అధికమగు సూచన. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన, పంచమ స్థానము నందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానము నందు కుజుని ప్రభావం చేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును.

మకర రాశి జాతకులు నేడు దుర్దాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మ వారికి కుంకుమార్చన చేయడం మంచిది.

నేటి కుంభరాశి ఫలాలు

కుంభరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చర్చలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ముఖ్యమైన విషయాల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. ఆరో స్థానము నందు కుజుడు, ఐదో స్థానము నందు శుక్రుడు, తృతీయ స్థానము నందు రాహువు అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును.

కుంభ రాశి జాతకులు నేడు విఘ్నేశ్వరుని పూజించాలి.. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

ఈరోజు మీన రాశి ఫలితాలు

మీనరాశి జాతకులకు ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. చర్చలకు వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలయందు ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో గానీ, ఉద్యోగ వ్యాపారాలయందు గానీ చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీన రాశి జాతకులు నేడు బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించాలి. విఘ్నేశ్వరుడిని పూజించండి. రాహుకాల సమయంలో దుర్దాదేవిని పూజించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel

టాపిక్