Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఈరోజు ధనలాభము.. వస్తు లాభము..-today horoscope in telugu based on career and life for 17th november 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 17th November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఈరోజు ధనలాభము.. వస్తు లాభము..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 17, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 17వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (17-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. చికాకులు, ఆటంకములు, గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు తగ్గించుకొనుట మంచిది. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, స్నేహితుల మధ్య స్పర్థలు కలిగే అవకాశమున్నది. మరింత శుభఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఒత్తిడి ఉంటుంది. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి.. మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజించడం మంచిది.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ధన లాభము కలుగుతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభఫలితాల కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధిస్తాయి. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. చేసే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. ధన సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించడం మంచిది. శుభఫలితాలు పొందడం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉన్నది. ధన లాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉన్నప్పటికీ.. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. సమాజంలో కీర్తి, కుటుంబంలో గౌరవము పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నిస్తారు. కుటుంబములోని సమస్యలు తగ్గుతాయి. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్లి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలముగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు లాభము, సౌఖ్యము కలుగుతుంది. ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొంత కాలంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు ఉన్నాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటే మంచిది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. కీర్తి, సౌఖ్యము కలుగుతుంది. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం