Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి..-today horoscope in telugu based on career and life for 16th november 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 16th November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 16, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 16వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (16-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేషరాశి వారికి ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పనులు ఒత్తిడి ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఇబ్బంది పెడతాయి. విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

వృషభరాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

మిధునరాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉండదు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఇబ్బంది పెడుతుంది. కానీ ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణములో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుద్రాభిషేకము, శివారాధన చేయడం మంచిది.

కర్కాటకరాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లటం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, శివాభిషేకం చేసుకోవడం మంచిది.

సింహరాశి

ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివునికి అభిషేకము చేసుకోవడం మంచిది.

కన్యారాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనలాభము కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం చంద్రశేఖరాష్టకము, లింగాష్టకం పఠించడం మంచిది.

తులా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శరీర సౌఖ్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము పొందుతారు. ధనలాభము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివునికి అభిషేకం చేయండి.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగములో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లింగాష్టకము, బిల్వాష్టకము చదువుకోవడం మంచిది.

ధనూ రాశి

ఈరోజు మీకు మధ్యస్థంగా ఉంటుంది. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. బంధు వియోగం ఏర్పడే అవకాశముంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివునికి అభిషేకం చేయడం మంచిది.

మకర రాశి

ఈ రోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి.

కుంభ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఆనందముగా గడుపుతారు. ఏలినాటి శని ప్రభావము ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విభూతితో శివునికి అభిషేకం చేయండి.

మీన రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్