Sita Navami 2023: సీతా నవమి ఎందుకు జరుపుకుంటారంటే..
Sita Navami 2023: ఆచారాల నుండి ప్రాముఖ్యత వరకు, ఈ పవిత్రమైన ఈరోజు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
సీతానవమి 2023: సీతా నవమిని దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్దయెత్తున జరుపుకుంటారు. సీతా జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు చేసుకుంటారు. శ్రీరాముడి భార్య సీతాదేవి స్వచ్ఛతకు, నిజాయతీకి నిలువెత్తు రూపం. సీతాదేవిని జానకీదేవి గా కూడా కొలుస్తారు. ఈ రోజున పవిత్ర నదీస్నానం ఆచరించి సీతాదేవి ఆశీర్వాాదాలు తీసుకోవడం ఆనవాయితీ. ఈ పండగ గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలేంటంటే..
ట్రెండింగ్ వార్తలు
తేదీ:
ఈ సంవత్సరం సీతా నవమిని ఏప్రిల్ 29 న జరుపుకోబోతున్నాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి రోజున ఈ పండగ జరుపుకుంటారు. దృక్ పంచాంగం ప్రకారం నవమి తిథి ఏప్రిల్ 28 రోజు సాయంత్రం 04:01 గంటలకు మొదలై ఏప్రిల్ 29 న సాయంత్రం 06:22 గంటలకు ముగుస్తుంది.
చరిత్ర:
హిందూ పురాణాల ప్రకారం, సీతాదేవి జనక మహారాజు, రాణీ సునయన ల పుత్రిక. జనకుడు తన పొలాన్ని యాగం కోసం దున్నుతుండగా ఒక బంగారపు పెట్టెలో ఒక పాపను చూస్తాడు. తనని దత్తత తీసుకొని సీత అని నామకరణం చేస్తాడు. తరువాత సీతా కళ్యాణం అయోధ్య రాజు శ్రీ రాముడితో జరుగుతుంది. వాళ్లిద్దరి దాంపత్యం ప్రతి పెళ్లైన జంటకు ఒక స్ఫూర్తి. ప్రేమ, నిజాయతీ, త్యాాగాల గురించి సీతారాముల కథ చెబుతుంది. వాళ్లకు కూడా కష్టాలు తప్పలేదు. రాముడు 14 ఏళ్ల అరణ్య వాసానికి వెళ్లినపుడు సీతాదేవి, లక్షణులు రాముని వెంటే వెళ్లారు. తరువాత రావణుడు సీతాదేవిని అపహరించడం, రాముడు రావణున్ని ఓడించి సీతాదేవిని కాపాడటం జరిగింది.
ప్రాముఖ్యత:
సీతాదేవిని స్వచ్ఛతకు, పవిత్రతకు స్వరూపమని నమ్ముతారు. కుటుంబం కోసం ఆమె చేసిన త్యాగాలను గౌరవించి, ఆమెను కొలుస్తారు. ఈరోజు మహిళలు సీతాదేవి ఆశీర్వాదాలు వాళ్ల కుటుంబం మీద ఉండాలని ఉపవాసం స్వీకరిస్తారు.
వేడుకలు:
సీతానవమి చాలా ఆడంభరంగా పెద్దయెత్తున జరిగే వేడుక. భక్తులు నదిలో పవిత్ర స్నానం చేసి మంత్ర జపాలతో రోజును ప్రారంభిస్తారు. మహిళలు రోజు మొత్తం ఉపవాసం ఉండి సీతాదేవిని కొలుస్తారు. తరువాతి రోజు ఉపవాసం విరమిస్తారు.
టాపిక్