సోమవారం ఏంచేయాలి? దీని విశేషమేమిటి?-significance of monday find out whome to worship today ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Significance Of Monday Find Out Whome To Worship Today

సోమవారం ఏంచేయాలి? దీని విశేషమేమిటి?

HT Telugu Desk HT Telugu
Jun 05, 2023 08:21 AM IST

సోమవారం ఏంచేయాలి? దీని విశేషమేమిటి? ఈరోజు ఏ దైవాన్ని ఆరాధించాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

కాళేశ్వరంలో కొలువై ఉన్న శివుడు
కాళేశ్వరంలో కొలువై ఉన్న శివుడు (Govt of Telangana)

మన సనాతన ధర్మంలో ప్రతీరోజుకు ఒక విశేషము ప్రాధాన్యత ఉన్నది. ఆ ప్రాధాన్యత ప్రకారము ఆయొక్క దేవీ దేవతల పూజ ఉపాసన, ఆరాధన వంటివి ఆచరించడం సనాతన ధర్మంలో ఉన్న ప్రత్యేకత అని ప్రముఖ అధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ మరియు కరణములనే ఐదు అంగములు. వీటిలో వారమునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. వారములో రెండో రోజు సోమవారము. సోమవారం ఏ వ్యక్తియైనా ఆచరించవలసిన నియమాలను చిలకమర్తి వివరించారు. 

ట్రెండింగ్ వార్తలు

సోమవారం శివారాధన చాలా విశేషం. శివాలయంలో ఈరోజు పాలు, పెరుగుతో ఈశ్వరుణ్ణి అభిషేకం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు. సోమవారం చంద్రశేఖర అష్టకం పఠించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 

సోమవారం పంచామృతాలతో శివుని అభిషేకించినటువంటి వారికి సకల కోరికలు నెరవేరి భోగభాగ్యాలు నెరవేరును. రుద్రం విన్నవారికి లేదా పఠించినటువంటి వారికి శివానుగ్రహం కలుగును. శివ పంచాక్షరీ మంత్రం అయినటువంటి ఓం నమశ్శివాయ అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ జపం చేసిన వారికి శివ అనుగ్రహం కలుగును.

సోమవారం శివుణ్ణి అష్టోత్తర శతనామావళితో పూజించడం వలన మరింత శుభఫలితాలు కలుగును. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం, అలాగే ప్రసిద్ధిగాంచిన శివాలయాలన్నింటిలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్