Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఈరోజు సూర్య అష్టకం పఠించాలి!-horoscope today check telugu rasi phalalu astrological predictions for 25 october 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఈరోజు సూర్య అష్టకం పఠించాలి!

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఈరోజు సూర్య అష్టకం పఠించాలి!

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 06:06 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ అకోబర్ 25, 2022కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu
Horoscope Today in Telugu

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలితము) 25.10.2022

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: ఆశ్వయుజం

వారం: మంగళవారం, తిథి: కృ. అమావాస్య నక్షత్రం: చిత్త

మేష రాశి :

మేష రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. బంధుమిత్రులతో గడిపెదరు. జన్మ రాహువు ప్రభావం చేత చికాకులు, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. కుటుంబము కొరకు మీ ఆనందము కొరకు ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. శని అనుకూల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మేష రాశివారు ఖర్చులను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని సూచన. మేషరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం, దుర్గాదేవిని పూజించడం మంచిది. మేషరాశివారు మరింత శుభ ఫలితాల కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృషభ రాశి :

వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభము, సౌఖ్యము కలుగును. శత్రువులమీద విజయము పొందెదరు. ద్వితీయ స్థానము కుజుడు, వ్యయ స్థానము రాహువు ప్రభావంచేత కుటుంబ ఖర్చులతో గొడవలు ఏర్పడు సూచన. అనవసరంగా సలహాలు ఇవ్వకుండా ఉండటం మంచిది. ప్రయాణములు అనుకూలించును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మృష్టాన్న భోజన ప్రాప్తి. వృషభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

మిథున రాశి :

మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంది. మిథున రాశి వారికి అష్టమ శని జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత మానసిక వేదనలు ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు అధికమగును. పనుల యందు చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. మిథున రాశి వారికి ఈ వారం ధన లాభము కలుగును. అష్టమశని ప్రభావంచేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మిథునరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఖర్చులు అధికమగును. ఇష్టమైన వస్తువుల కోసం కుటుంబ అవసరాల కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. ఈ వారం మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. చతుర్గ స్థానమునందు కేతువు సంచారము వలన స్త్రీలతో జాగ్రత్త వహించాలి. శని వక్రియై సంచరించుట వలన కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించును. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వచ్చును. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్థిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి. కర్కాటక రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కుజుని అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, సౌఖ్యము కలుగును. అష్టమ గురుని ప్రభావంముచేత సింహరాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఉ ద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. అష్టమ గురుని ప్రభావము చేత సింహరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారం. ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి. సింహరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

కన్య రాశి:

కన్య రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. కన్యారాశివారికి ఈ వారం ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగును. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు వెళ్ళి విజయము పొందెదరు. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. కన్య రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభఫలితము కలుగును.

తులా రాశి :

తులా రాశి వారికి ఈ రోజు మధ్యస్తం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. జన్మరాశి యందు రవి బుధ శుక్ర కేతువుల ప్రభావం చేత మానసిక ఘర్షణలు, ఒత్తిళ్ళు అధికమగును. కుటుంబ విషయాలయందు జాగ్రత్త వహించాలి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. భాగ్యస్థానము నందు గురుడు అనుకూలత వలన ప్రయాణములు అనుకూలించును. లాభములు కలుగును. సౌఖ్యము పొందెదరు. శత్రువులతో జాగ్రత్త వహించాలి. జన్మరాశి యందు కేతువు, శత్రు స్థానము నందు గురుని సంచారము వలన తులారాశి వారికి ఉ ద్యోగమునందు ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిడి , శత్రుత్వ భయము కలుగును. కుటుంబము నందు మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అప్పుల ఒత్తిడి వుండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు. తులా రాశి వారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ఖర్చులు చికాకులు, పని ఒత్తిళ్ళు అధికమగును. ముఖ్యమైన వస్తువుల కోసం ధనము ఖర్చు చేసెదరు. వ్యయస్థానము రవి, శుక్ర, కేతువుల ప్రభావం వలన ఖర్చులు పెరుగును. దాన ధర్మములు అధికముగా చేసెదరు. శని అనుకూల ప్రభావము చేత, పంచమ స్థానము గురువు, ఆరవ స్థానము రాహువు ప్రభావము చేత అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. వృశ్చికరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. సమాజము నందు కీర్తి కుటుంబము నందు గౌరవము పెరుగును. లాభము రవి ప్రభావము చేత ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయము. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది. వృశ్చిక రాశివారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితములు కలుగును.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితములు ఉన్నవి. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగును. సమాజము నందు కీర్తి కలుగును. ప్రయాణములు అనుకూలించును. లాభ స్థానము నందు కేతువు, రవి, శుక్రుడు ప్రభావం చేత ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. ధనుస్సు రాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించటం చేయాలి. ధనూ రాశివారికి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ధనలాభము, వస్తు లాభము కలుగును. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్యము కుదుటపడును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. దశమమునందు రవి శుక్ర కేతువుల అనుకూలత వలన మీ కృషితో పట్టుదలతో ముందుకు వెళ్ళి కార్యములు పూర్తి చెసేదరు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును. మకర రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి రాహువు, కుజ, శుక్ర గ్రహాల అనుకూలత వలన ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు లాభము, సౌఖ్యము కలుగును వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. గత కొంత కాలంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చును. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు కలిగించును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ధనవ్యయము ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టును. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించును. ఏలినాటి శని ప్రభావంచేత ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. శత్రువుల బాధలు అధికముగా ఉండును. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును. కుంభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్తముగా ఉన్నది. జన్మరాశి యందు గురుని ప్రభావం చేత మీన రాశివారికి ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మానసిక ఆందోళనలు పెరుగును. ఆరోగ్య విషయములలో జాగ్రత్త వహించాలి. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. అష్టమ స్థానమునందు రవి, శుక్ర, కేతు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. మీనరాశివారు గురువారం రోజు శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్