Wrestlers Protest: బారికేడ్లను దాటుకొని దూసుకెళ్లిన రైతులు.. రెజ్లర్లకు మద్దతుగా..-wrestlers protest bku farmers clash with police at jantar mantar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wrestlers Protest: బారికేడ్లను దాటుకొని దూసుకెళ్లిన రైతులు.. రెజ్లర్లకు మద్దతుగా..

Wrestlers Protest: బారికేడ్లను దాటుకొని దూసుకెళ్లిన రైతులు.. రెజ్లర్లకు మద్దతుగా..

May 08, 2023, 04:22 PM IST Chatakonda Krishna Prakash
May 08, 2023, 04:22 PM , IST

  • Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న భారత టాప్ రెజర్లకు భారతీయ కిసాన్ మోర్చా (BKU) రైతులు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరం వద్దకు వెళ్లే క్రమంలో అడ్డుకున్న పోలీసులతో రైతులు ఘర్షణకు దిగారు. బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లారు. 

రెజర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీకేయూ రైతులు సోమవారం జంతర్ మంతర్ వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా మరికొందరు రెజర్లు జంతర్ మంతర్ వద్ద రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. 

(1 / 8)

రెజర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీకేయూ రైతులు సోమవారం జంతర్ మంతర్ వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా మరికొందరు రెజర్లు జంతర్ మంతర్ వద్ద రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. (PTI)

రెజ్లర్లు ఆందోళన చేస్తున్న స్థలం వద్దకు వెళ్లే క్రమంలో అడ్డుగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీకేయూకు చెందిన రైతులు తొలగించారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లారు. 

(2 / 8)

రెజ్లర్లు ఆందోళన చేస్తున్న స్థలం వద్దకు వెళ్లే క్రమంలో అడ్డుగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీకేయూకు చెందిన రైతులు తొలగించారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లారు. (PTI)

రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు రైతులు ర్యాలీగా వస్తున్నారన్న సమాచారంతో.. 2000 వేల మంది భద్రతా సిబ్బందిని మే 7న జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వం మోహరించింది. 

(3 / 8)

రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు రైతులు ర్యాలీగా వస్తున్నారన్న సమాచారంతో.. 2000 వేల మంది భద్రతా సిబ్బందిని మే 7న జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వం మోహరించింది. (PTI)

లైగింక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికే డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‍పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

(4 / 8)

లైగింక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికే డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‍పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (PTI)

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి బ్రిజ్ భూషణ్‍ను తొలగించాలని రెండు వారాలుగా రెజర్లు.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. 

(5 / 8)

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి బ్రిజ్ భూషణ్‍ను తొలగించాలని రెండు వారాలుగా రెజర్లు.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. (PTI)

ట్రాక్టర్ ట్రాలీల్లో కాకుండా  బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రైతులు.. దేశ రాజధానిలోకి వస్తున్నారని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది,

(6 / 8)

ట్రాక్టర్ ట్రాలీల్లో కాకుండా  బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రైతులు.. దేశ రాజధానిలోకి వస్తున్నారని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది,(PTI)

రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు వేరే రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న రైతులను గుర్తించేందుకు 200 మంది ఢిల్లీ పోలీసులు, పాలమిటరీ దళాలను టిక్రీ సరిహద్దు, నాన్‍గ్లోయ్ చౌక్, పీరాఘరీ చౌక్, ముంద్కా చౌక్ వద్ద మోహరించినట్టు ఓ అధికారి చెప్పారు. 

(7 / 8)

రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు వేరే రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న రైతులను గుర్తించేందుకు 200 మంది ఢిల్లీ పోలీసులు, పాలమిటరీ దళాలను టిక్రీ సరిహద్దు, నాన్‍గ్లోయ్ చౌక్, పీరాఘరీ చౌక్, ముంద్కా చౌక్ వద్ద మోహరించినట్టు ఓ అధికారి చెప్పారు. (PTI)

న్యూ ఢిల్లీ జోన్‍లో మొత్తంగా 1300 మందికిపై పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భద్రతా చర్యల్లో ఉన్నారు. జంతర్ మంతర్ వద్ద సీసీటీటీ కంట్రోల్ రూమ్‍ను పోలీసులు ఏర్పాటు చేశారు. 

(8 / 8)

న్యూ ఢిల్లీ జోన్‍లో మొత్తంగా 1300 మందికిపై పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భద్రతా చర్యల్లో ఉన్నారు. జంతర్ మంతర్ వద్ద సీసీటీటీ కంట్రోల్ రూమ్‍ను పోలీసులు ఏర్పాటు చేశారు. (PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు