Uppal skywalk : 26న 'ఉప్పల్‌ స్కైవాక్‌' ప్రారంభం - ఈ సరికొత్త వంతెన ప్రత్యేకతలివే-uppal skywalk to inauguration on 26 june ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Uppal Skywalk : 26న 'ఉప్పల్‌ స్కైవాక్‌' ప్రారంభం - ఈ సరికొత్త వంతెన ప్రత్యేకతలివే

Uppal skywalk : 26న 'ఉప్పల్‌ స్కైవాక్‌' ప్రారంభం - ఈ సరికొత్త వంతెన ప్రత్యేకతలివే

Jun 24, 2023, 08:28 AM IST Maheshwaram Mahendra Chary
Jun 24, 2023, 08:28 AM , IST

  • Uppal skywalk Brdige Inauguration:ఉప్పల్‌ స్కైవాక్‌ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. జూన్ 26వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రిడ్జి విశేషాలెంటో ఇక్కడ చూడండి……

ఉప్పల్‌ రింగురోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను సిద్ధం చేసింది.ఈనెల 26న ఉప్పల్‌ వంతెనను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

(1 / 5)

ఉప్పల్‌ రింగురోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను సిద్ధం చేసింది.ఈనెల 26న ఉప్పల్‌ వంతెనను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.(twitter)

దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా ఉప్పల్ స్కైవాక్ రికార్డుల్లోకి ఎక్కనుంది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో ఈ పనులు పూర్తి చేశారు.

(2 / 5)

దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా ఉప్పల్ స్కైవాక్ రికార్డుల్లోకి ఎక్కనుంది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో ఈ పనులు పూర్తి చేశారు.(twitter)

రాబోయే వంద సంవత్సరాలకుపైగా ప్రజానీకం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన జరిగింది.   ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడకంతో పూర్తి చేశారు

(3 / 5)

రాబోయే వంద సంవత్సరాలకుపైగా ప్రజానీకం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన జరిగింది.   ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడకంతో పూర్తి చేశారు(twitter)

ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే(రోడ్ క్రాసింగ్) సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం.ఇది అందుబాటులోకి వస్తే పాదచారుల కష్టాలు తీరనున్నాయి. రింగురోడ్డులో ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఫ్రీగా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది.  

(4 / 5)

ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే(రోడ్ క్రాసింగ్) సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం.ఇది అందుబాటులోకి వస్తే పాదచారుల కష్టాలు తీరనున్నాయి. రింగురోడ్డులో ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఫ్రీగా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది.  (twitter)

స్కైవాక్‌ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు.ఇరువైపులా రెయిలింగ్‌ ఉంది. ఇక్కడ అమర్చిన  ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, మూడు(3), నాలుగు(4), అరు(6) మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుండి అరు(6) మీటర్ల ఎత్తులో ఉంటుంది.   మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్) బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. 

(5 / 5)

స్కైవాక్‌ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు.ఇరువైపులా రెయిలింగ్‌ ఉంది. ఇక్కడ అమర్చిన  ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, మూడు(3), నాలుగు(4), అరు(6) మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుండి అరు(6) మీటర్ల ఎత్తులో ఉంటుంది.   మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్) బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. (twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు