Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం
- Tirumala : తిరుమలలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్నపన తిరుమంజనం ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
- Tirumala : తిరుమలలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్నపన తిరుమంజనం ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
(1 / 6)
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
(2 / 6)
శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు.
(3 / 6)
తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
(4 / 6)
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
(5 / 6)
టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణ చేశారు. కోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఇతర గ్యాలరీలు