5G smartphones under Rs. 20000: 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా.. రూ.20వేలలోపు ధరలో కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇవే-top 5 5g smartphones to buy under rs 20000 from samsung to vivo ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  5g Smartphones Under Rs. 20000: 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా.. రూ.20వేలలోపు ధరలో కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇవే

5G smartphones under Rs. 20000: 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా.. రూ.20వేలలోపు ధరలో కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇవే

Jan 08, 2024, 10:12 PM IST Chatakonda Krishna Prakash
Nov 15, 2022, 06:46 PM , IST

5G Phones under Rs. 20000: టెలికం సంస్థలు జియో, ఎయిర్ టెల్ దేశంలో 5జీ సర్వీస్‍లను లాంచ్ చేశాయి. కొన్ని ప్రధాన నగరాల్లో 5జీ నెట్‍వర్క్ అందుబాటులోకి వచ్చింది. మరిన్ని నగరాలకు కూడా త్వరలోనే 5జీ  విస్తరిస్తుంది. ఈ తరుణంలో 5జీ ఫోన్‍లను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. రూ.20వేలలోపు 5జీ మొబైల్స్ కోసం చూస్తున్నారు. అలాంటి వారి కోసం కొన్ని మొబైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రూ.20వేలలోపు ధరతో లభిస్తున్న 5జీ మొబైళ్లలో కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఇవే. 

Samsung Galaxy F23 5G: మిడ్ రేంజ్‍లో ఒకానొక బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్‍గా సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ఉంది. రూ.20వేలలోపు 5జీ ఫోన్ కొనాలంటే ఇది మంచి ఆప్షన్‍గా అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎఫ్23 5జీ 128జీబీ వేరియంట్ లిస్టింగ్ ధర రూ.23,999 కాగా.. ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ లో రూ.16,999కు లభిస్తోంది.

(1 / 5)

Samsung Galaxy F23 5G: మిడ్ రేంజ్‍లో ఒకానొక బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్‍గా సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ఉంది. రూ.20వేలలోపు 5జీ ఫోన్ కొనాలంటే ఇది మంచి ఆప్షన్‍గా అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎఫ్23 5జీ 128జీబీ వేరియంట్ లిస్టింగ్ ధర రూ.23,999 కాగా.. ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ లో రూ.16,999కు లభిస్తోంది.(Samsung)

Poco M4 Pro 5G: షావోమీ సబ్‍బ్రాండ్ పోకో నుంచి బడ్జెట్, మిడ్ రేంజ్‍లో చాలా స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. వీటిలో పోకో ఎం4 ప్రో 5జీ ఆకర్షణీయంగా ఉంది. ఎం4 ప్రో 5జీ అసలు ధర రూ.19,999 కాగా.. ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ లో రూ.17,199కు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.16,500 వరకు పొందవచ్చు. మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్చేంజ్ విలువ ఉంటుంది.

(2 / 5)

Poco M4 Pro 5G: షావోమీ సబ్‍బ్రాండ్ పోకో నుంచి బడ్జెట్, మిడ్ రేంజ్‍లో చాలా స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. వీటిలో పోకో ఎం4 ప్రో 5జీ ఆకర్షణీయంగా ఉంది. ఎం4 ప్రో 5జీ అసలు ధర రూ.19,999 కాగా.. ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ లో రూ.17,199కు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.16,500 వరకు పొందవచ్చు. మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్చేంజ్ విలువ ఉంటుంది.(Poco)

Samsung Galaxy F42 5G: మిడ్ రేంజ్‍లో సామ్‍సంగ్ నుంచి అందుబాటులో ఉన్న మరో 5జీ ఫోన్ ఇది.  సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ ప్రస్తుతం తగ్గింపుతో రూ.18,999కు లభిస్తోంది. ఫ్లిప్‍కార్ట్ లో ఈ ఫోన్ డిస్కౌంట్‍తో అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి.

(3 / 5)

Samsung Galaxy F42 5G: మిడ్ రేంజ్‍లో సామ్‍సంగ్ నుంచి అందుబాటులో ఉన్న మరో 5జీ ఫోన్ ఇది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ ప్రస్తుతం తగ్గింపుతో రూ.18,999కు లభిస్తోంది. ఫ్లిప్‍కార్ట్ లో ఈ ఫోన్ డిస్కౌంట్‍తో అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి.(Samsung)

Motorola G62 5G: రూ.20వేలలోపు ధరలో వన్ ఆఫ్ ది బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్‍గా ఇది నిలుస్తోంది. మోటోరోలా జీ62 5జీ మొబైల్‍ను ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ లో రూ.15,999కే దక్కించుకోవచ్చు. పాత ఫోన్‍ను ఎక్స్చేంజ్ కింద మారిస్తే మరింత తక్కువకే ఈ మోటోరోలా ఫోన్‍ను సొంతం చేసుకోవచ్చు.

(4 / 5)

Motorola G62 5G: రూ.20వేలలోపు ధరలో వన్ ఆఫ్ ది బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్‍గా ఇది నిలుస్తోంది. మోటోరోలా జీ62 5జీ మొబైల్‍ను ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ లో రూ.15,999కే దక్కించుకోవచ్చు. పాత ఫోన్‍ను ఎక్స్చేంజ్ కింద మారిస్తే మరింత తక్కువకే ఈ మోటోరోలా ఫోన్‍ను సొంతం చేసుకోవచ్చు. (Motorola)

Vivo T1 5G: వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్‍పై ఫ్లిప్‍కార్ట్ లో ప్రస్తుతం మంచి డీల్ ఉంది. లిస్టింగ్ ధరపై 20శాతం తగ్గింపుతో బేస్ వేరియంట్ ప్రస్తుతం రూ.15,990కు లభిస్తోంది. ఎక్స్చేంజ్, బ్యాంక్ కార్డ్ ఆఫర్లను కూడా వినియోగించుకోవచ్చు.

(5 / 5)

Vivo T1 5G: వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్‍పై ఫ్లిప్‍కార్ట్ లో ప్రస్తుతం మంచి డీల్ ఉంది. లిస్టింగ్ ధరపై 20శాతం తగ్గింపుతో బేస్ వేరియంట్ ప్రస్తుతం రూ.15,990కు లభిస్తోంది. ఎక్స్చేంజ్, బ్యాంక్ కార్డ్ ఆఫర్లను కూడా వినియోగించుకోవచ్చు.(Vivo)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు