Republic Day 2023 Parade: ‘గణతంత్ర’ పరేడ్‍లో శకటాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ శకటం
74th Republic Day Parade: ఢిల్లీలోని కర్తవ్యపథ్‍పై గణతంత్ర దినోత్సవ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ పరేడ్‍లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శనకు వచ్చాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలా పరేడ్‍లో ఆకట్టుకున్న వాటిలో కొన్నింటి వివరాలు..
(1 / 8)
మకర సంక్రాంతి సమయంలో కోనసీమలో జరిగే 'ప్రభల తీర్థం' వేడుకను ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ శకటం రూపొందింది. కర్తవ్యపథ్‍పై జరిగిన పరేడ్‍లో ఇది ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది.(ANI)
(2 / 8)
గిరిజన పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా, ప్రముఖ వైద్యనాథ్ ఆలయం, సొహారై పెయింటింగ్‍లతో కూడిన శకటాన్ని జార్ఘంజ్ ప్రదర్శించింది. (ANI)
(3 / 8)
అహోం దిగ్గజ యోధుడు జనరల్ లచిత్ బోడ్‍పుకాన్, కామఖ్యా దేవాలయంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అసోం శకతం తయారైంది. (ANI)
(4 / 8)
మహిళా శక్తికి ప్రతీకగా శకటాన్ని త్రిపుర ప్రదర్శించింది. పర్యాటకం, సేంద్రియ వ్యవసాయం గురించి శకటంలో వివరించింది.(ANI)
(6 / 8)
కార్బెట్ నేషనల్ పార్క్, అల్మోరా జగద్వీశర్ థామ్‍ను ప్రతిబింబిస్తూ ఉత్తరాఖండ్ శకటం పరేడ్‍లో ప్రదర్శనకు వచ్చింది.(ANI)
(8 / 8)
పర్యాటకం ప్రధాన థీమ్‍గా అరుణాచల్ ప్రదేశ్‍కు చెందిన శకటం.. కర్తవ్యపథ్‍పై జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‍కు వచ్చింది. (ANI)
ఇతర గ్యాలరీలు