Travel gadgets, accessories: ట్రావెలింగ్‍లో మీ దగ్గర తప్పక ఉండాల్సిన గాడ్జెట్లు, యాక్ససరీలు -must have travel gadgets accessories to make your journey effortless ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Must Have Travel Gadgets Accessories To Make Your Journey Effortless

Travel gadgets, accessories: ట్రావెలింగ్‍లో మీ దగ్గర తప్పక ఉండాల్సిన గాడ్జెట్లు, యాక్ససరీలు

Feb 20, 2023, 08:47 PM IST Chatakonda Krishna Prakash
Feb 20, 2023, 08:47 PM , IST

  • Travel gadgets, accessories: ప్రయాణాలు చేసే సమయాల్లో మీ దగ్గర కొన్ని గ్యాడ్జెట్లు, యాక్ససరీలు తప్పక ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంటే జర్నీ మరింత సులభతరంగా మారుతుంది. అవేంటంటే..

ట్రావెలింగ్ మీకు మంచి ఆనందాన్ని, అనుభూతులను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు రవాణా చేయడం కాస్త ఒత్తిడిగా ఉంటుంది. అలసట వస్తుంది. అయితే కొన్ని గాడ్జెట్లు, యాక్ససరీలు వాడితే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ట్రావెలింగ్‍లో బోర్ కొట్టకుండా చేసుకోవచ్చు. మీ ట్రిప్‍ను మరింత ఎంజాయ్ చేయవచ్చు.

(1 / 8)

ట్రావెలింగ్ మీకు మంచి ఆనందాన్ని, అనుభూతులను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు రవాణా చేయడం కాస్త ఒత్తిడిగా ఉంటుంది. అలసట వస్తుంది. అయితే కొన్ని గాడ్జెట్లు, యాక్ససరీలు వాడితే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ట్రావెలింగ్‍లో బోర్ కొట్టకుండా చేసుకోవచ్చు. మీ ట్రిప్‍ను మరింత ఎంజాయ్ చేయవచ్చు.(Unsplash)

Power Bank/Portable Charger: ట్రావెల్ చేస్తున్న సమయంలో మీ వద్ద పవర్ బ్యాంక్ ఉండడం చాలా ముఖ్యం. మొబైల్ చార్జింగ్ పూర్తిగా అయిపోతున్న సమయంలో పవర్ బ్యాంక్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సినిమా చూస్తున్నా.. పాటలు వింటున్నా.. ఆ సమయంలో ఫోన్ చార్జింగ్ అయిపోతుంటే.. పవర్ బ్యాంక్ ద్వారా చార్జ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. 

(2 / 8)

Power Bank/Portable Charger: ట్రావెల్ చేస్తున్న సమయంలో మీ వద్ద పవర్ బ్యాంక్ ఉండడం చాలా ముఖ్యం. మొబైల్ చార్జింగ్ పూర్తిగా అయిపోతున్న సమయంలో పవర్ బ్యాంక్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సినిమా చూస్తున్నా.. పాటలు వింటున్నా.. ఆ సమయంలో ఫోన్ చార్జింగ్ అయిపోతుంటే.. పవర్ బ్యాంక్ ద్వారా చార్జ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. (freepik )

Noise Cancelling Headphones: ప్రయాణం చేస్తున్న సమయాల్లో శబ్దాల నుంచి తప్పించుకోవాలంటే నాయిస్ క్యాన్సలింగ్ హెడ్‍ఫోన్స్ ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువ సేపు విమానంలో ప్రయాణించాలంటే ఈ ఫీచర్ ఉన్న ఈ ఇయర్ ఫోన్స్ చాలా ఉపయోగపడతాయి. హెడ్‍ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సలేషన్ ఎనేబుల్ చేసుకుంటే బయటి నుంచే వచ్చే శబ్దాలు చాలా వరకు మీకు వినపడవు. శబ్దాల బెడద లేకుండా ప్రశాంతంగా పాటలు వినొచ్చు, మూవీ చూడొచ్చు.

(3 / 8)

Noise Cancelling Headphones: ప్రయాణం చేస్తున్న సమయాల్లో శబ్దాల నుంచి తప్పించుకోవాలంటే నాయిస్ క్యాన్సలింగ్ హెడ్‍ఫోన్స్ ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువ సేపు విమానంలో ప్రయాణించాలంటే ఈ ఫీచర్ ఉన్న ఈ ఇయర్ ఫోన్స్ చాలా ఉపయోగపడతాయి. హెడ్‍ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సలేషన్ ఎనేబుల్ చేసుకుంటే బయటి నుంచే వచ్చే శబ్దాలు చాలా వరకు మీకు వినపడవు. శబ్దాల బెడద లేకుండా ప్రశాంతంగా పాటలు వినొచ్చు, మూవీ చూడొచ్చు.(Pexels)

Universal Waterproof Phone Case: మీరు వాటర్ యాక్టివిటీల కోసం ట్రిప్‍కు వెళుతుంటే ఈ యూనివర్సల్‍ వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్ చాలా ఉపయోగపడుతుంది. బీచ్‍లకు వెళ్లే వారికి ఇది చాలా ముఖ్యమైన యాక్ససరీ. ఈ కేస్‍లో ఫోన్ ఉంటే మీరు నీటిలోకి వెళ్లినా మొబైల్ పొడిగా ఉంటుంది.

(4 / 8)

Universal Waterproof Phone Case: మీరు వాటర్ యాక్టివిటీల కోసం ట్రిప్‍కు వెళుతుంటే ఈ యూనివర్సల్‍ వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్ చాలా ఉపయోగపడుతుంది. బీచ్‍లకు వెళ్లే వారికి ఇది చాలా ముఖ్యమైన యాక్ససరీ. ఈ కేస్‍లో ఫోన్ ఉంటే మీరు నీటిలోకి వెళ్లినా మొబైల్ పొడిగా ఉంటుంది.(pinterest)

Travel Pillow: సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు మీ వెంట ట్రావెల్ పిల్లో ఉంచుకోండి. ఒకవేళ ట్రావెల్‍లో నిద్ర వస్తే ఈ పిల్లో తలకింద పెట్టుకొని కూర్చునే సదుపాయంగా నిద్రపోవచ్చు. కార్, ఫ్లైట్ జర్నీలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. 

(5 / 8)

Travel Pillow: సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు మీ వెంట ట్రావెల్ పిల్లో ఉంచుకోండి. ఒకవేళ ట్రావెల్‍లో నిద్ర వస్తే ఈ పిల్లో తలకింద పెట్టుకొని కూర్చునే సదుపాయంగా నిద్రపోవచ్చు. కార్, ఫ్లైట్ జర్నీలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. (freepik)

Waterproof Backpack: ట్రెక్కింగ్ లాంటి ఔట్‍డోర్ యాక్టివిటీలకు వెళ్లే వారు, బీచ్‍లకు వెళ్లే వారు తమ వెంట వాటర్ ప్రూఫ్ బ్యాక్‍ప్యాక్‍ను తీసుకెళ్లాలి. దీంట్లో పెట్టుకుంటే మీ ముఖ్యమైన వస్తువులు పొడిగా ఉంటాయి. నీటి నుంచి రక్షణ ఉంటుంది.

(6 / 8)

Waterproof Backpack: ట్రెక్కింగ్ లాంటి ఔట్‍డోర్ యాక్టివిటీలకు వెళ్లే వారు, బీచ్‍లకు వెళ్లే వారు తమ వెంట వాటర్ ప్రూఫ్ బ్యాక్‍ప్యాక్‍ను తీసుకెళ్లాలి. దీంట్లో పెట్టుకుంటే మీ ముఖ్యమైన వస్తువులు పొడిగా ఉంటాయి. నీటి నుంచి రక్షణ ఉంటుంది.(Pexels)

Travel-sized Toiletries: చిన్న బాటిళ్లలో ఉండే ట్రావెల్ సైజ్డ్ షాంపో, కండీషనర్, తూత్‍పేస్ట్ లాంటివి పెట్టుకోవాలి. ఇలా సైజులో చిన్న బాటిళ్లను ఉంచుకోవడం వల్ల లగేజీలో స్పేస్ మిగులుతుంది.

(7 / 8)

Travel-sized Toiletries: చిన్న బాటిళ్లలో ఉండే ట్రావెల్ సైజ్డ్ షాంపో, కండీషనర్, తూత్‍పేస్ట్ లాంటివి పెట్టుకోవాలి. ఇలా సైజులో చిన్న బాటిళ్లను ఉంచుకోవడం వల్ల లగేజీలో స్పేస్ మిగులుతుంది.(Pexels )

GPS Tracker: సోలో ట్రావెలింగ్‍కు వెళ్లే వారు, ట్రెక్కింగ్ లాంటి అడ్వంచర్లకు వెళ్లేవారు జీపీఎస్ ట్రాకర్‌ను వద్ద ఉంచుకోవాలి. సేఫ్టీ కోసం ఎవరైనా తమ లొకేషన్‍ను ట్రాక్ చేయాలనుకుంటే జీపీఎస్ ట్రాకర్ ఉపయోగపడుతుంది. ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా అవసరమైనప్పుడు లోకేషన్‍ను కూడా కావాల్సిన వారికి షేర్ చేయవచ్చు.

(8 / 8)

GPS Tracker: సోలో ట్రావెలింగ్‍కు వెళ్లే వారు, ట్రెక్కింగ్ లాంటి అడ్వంచర్లకు వెళ్లేవారు జీపీఎస్ ట్రాకర్‌ను వద్ద ఉంచుకోవాలి. సేఫ్టీ కోసం ఎవరైనా తమ లొకేషన్‍ను ట్రాక్ చేయాలనుకుంటే జీపీఎస్ ట్రాకర్ ఉపయోగపడుతుంది. ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా అవసరమైనప్పుడు లోకేషన్‍ను కూడా కావాల్సిన వారికి షేర్ చేయవచ్చు.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు