Suryakumar Yadav: సూర్యకుమార్ విషయంలో ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్‍న్యూస్!
- Suryakumar Yadav: ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుసగా రెండు పరాజయాలతో మంబై ఇండియన్స్ ఇబ్బందుల్లో ఉంది. ఈ తరుణంలో సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్‍నెస్ సాధించేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని సమాచారం బయటికి వచ్చింది. వివరాలివే..
- Suryakumar Yadav: ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుసగా రెండు పరాజయాలతో మంబై ఇండియన్స్ ఇబ్బందుల్లో ఉంది. ఈ తరుణంలో సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్‍నెస్ సాధించేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని సమాచారం బయటికి వచ్చింది. వివరాలివే..
(1 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడంపైనా రచ్చ సాగుతోంది. కాగా, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గాయం వల్ల అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది. (AFP)
(2 / 5)
సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా ఫిట్‍నెస్ సాధించి ఆడేందుకు రెడీగా ఉన్నాడని ఇటీవల సమాచారం బయటికి వచ్చింది. అయితే, అతడు మ్యాచ్ ఫిట్‍నెస్ సాధించేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు తాజాగా చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ నేడు (మార్చి 28) వెల్లడించింది. (AFP)
(3 / 5)
“ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్‍లో సూర్యకుమార్ రెండు మ్యాచ్‍లు మిస్ అయ్యాడు. మరికొన్ని మ్యాచ్‍లకు దూరమయ్యే అవకాశం ఉంది” అని ఆ వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది. అయితే, సూర్య వేగంగానే కోలుకుంటున్నాడని, ఈ సీజన్‍లో ముంబై తరఫున బరిలోకి దిగుతాడని అనుకుంటున్నామని చెప్పినట్టు వెల్లడించింది.
(4 / 5)
గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‍లో భారత స్టార్ సూర్య కుమార్ గాయపడ్డాడు. ఈ ఏడాది జనవరిలో అతడికి శస్త్రచికిత్స జరిగింది. అయితే, ఈ ఏడాది జూన్‍లో జరగనున్న టీ20 ప్రపంచకప్‍ను దృష్టి పెట్టుకొని పూర్తిగా కోలుకునే వరకు సూర్యను ఐపీఎల్‍లో బరిలోకి దింపకూడని ఎన్‍సీఏ భావిస్తోంది.(PTI)
ఇతర గ్యాలరీలు