Jio 5G services : 75 నగరాలకు విస్తరించిన జియో 5జీ సేవలు..
- Jio 5g services : 5జీ సేవలను విస్తరించే విషయంలో టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా.. ఈ పోటీలో రిలయన్స్ జియో ముందున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 75 ప్రాంతాల్లో 5జీ సేవలను ప్రారంభించింది జియో.
- Jio 5g services : 5జీ సేవలను విస్తరించే విషయంలో టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా.. ఈ పోటీలో రిలయన్స్ జియో ముందున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 75 ప్రాంతాల్లో 5జీ సేవలను ప్రారంభించింది జియో.
(1 / 6)
2022 అక్టోబర్‌లో తొలిసారిగా 5జీ సేవలను ప్రారంభించింది రిలయన్స్ జియో. తొలుత ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా, చెన్నైల్లో ఈ సేవలను మొదలుపెట్టింది.
(2 / 6)
నవంబర్‌లో.. బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్, పుణెలకు జియో 5జీ సేవలు విస్తరించాయి.
(3 / 6)
నవంబర్ 25 నాటికి.. గుజరాత్‌లోని 33 జిల్లాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అన్ని జిల్లాల్లోని 5జీ సేవలు లభిస్తున్న రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.
(4 / 6)
ఉజ్జెయిని ఆలయం, కొచ్చి, గురువాయూర్ ఆలయం, తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, గుంటూర్, లక్నో, త్రివేండ్రం, మైసూర్, నాసిక్, ఔరంగాబాద్, చంఢీగఢ్, మోహాలీ, పంచ్‌కుల, జిరాక్పూర్, ఖరార్, డేరాబస్సి, భోపాల్, ఇండోర్‌లో డిసెంబర్ నాటికి జియో 5జీ సేవలు మొదలయ్యాయి.
(5 / 6)
2023 జనవరి మొదటి వారంలో.. భువనేశ్వర్, కటక్, జబల్పూర్, గ్వాలియర్, లుథియానా, సిలిగురిలకు జియో 5జీ సేవలు విస్తరించాయి.
(6 / 6)
ఇక శనివారం.. రాజస్థాన్‌లోని మూడు ప్రాంతాల్లో జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా ఇప్పడు వరకు 5జీని జియో అందిస్తున్న నగరాల సంఖ్య 75కు పెరిగింది.
ఇతర గ్యాలరీలు