In Pics : సామూహిక జాతీయ గీతాలాపన.. ఏకమైన లక్షల గొంతులు-here is pictures about telangana samoohika jateeya geetalapana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here Is Pictures About Telangana Samoohika Jateeya Geetalapana

In Pics : సామూహిక జాతీయ గీతాలాపన.. ఏకమైన లక్షల గొంతులు

Aug 16, 2022, 02:53 PM IST Anand Sai
Aug 16, 2022, 02:53 PM , IST

  • 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గీతాలాపన జరిగింది. ఇందులో లక్షలాది మంది గొంతులు ఏకమయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల పేరిట 15 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంగళవారం ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు లక్షల సంఖ్యలో ప్రజలు సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు అంతా ఏకమై గొంతుక కలిపారు.

(1 / 11)

తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

(2 / 11)

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు, మెట్రో రైల్‌ స్టేషన్‌లలో సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించించారు.

(3 / 11)

రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లు మువ్వనెల జెండాలో కనిపించాయి. ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

(4 / 11)

రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లు మువ్వనెల జెండాలో కనిపించాయి. ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

(5 / 11)

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన జంక్షన్లలో ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతాలాపన సమయంలో అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ట్రాఫిక్ కూడా నిలిచిపోయాయి.

(6 / 11)

75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ఆగస్ట్ 8న ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 22 వరకు కొనసాగనున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి.

(7 / 11)

కవి సమ్మేళనాలు, జానపద కళాకారుల ప్రదర్శనలను వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది.

(8 / 11)

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కనీసం రక్తదాన శిబిరాలు ఉంటాయి. ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

(9 / 11)

హైదరాబాద్‌ ఆబిడ్స్‌ జీపీవో సర్కిల్‌లో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ (KCR), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, ఎంపీ కేకే పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇదే సమయంలో జాతీయ గీతాలాపన చేశారు.

(10 / 11)

గురు, శుక్ర, శనివారాల్లో రంగోలి పోటీలు, స్వాతంత్య్ర క్రీడలు, ఆటల పోటీలు, పండ్లు, మిఠాయిల పంపిణీ ఉంటాయి. హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో సోమవారం ఘనంగా వజ్రోత్సవాలు ముగుస్తాయి.

(11 / 11)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు