EPFO: ఉద్యోగులకు తీపికబురు! అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం-epfo issues guidelines to let subscribers to opt for higher pension ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Epfo Issues Guidelines To Let Subscribers To Opt For Higher Pension

EPFO: ఉద్యోగులకు తీపికబురు! అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం

Feb 21, 2023, 02:00 PM IST Chatakonda Krishna Prakash
Feb 21, 2023, 02:00 PM , IST

  • అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకొచ్చింది. 2014 ఆగస్టు 31కు ముందు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (EPS)లో చేరిన వారు ఈ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్‍ఓ తీసుకొచ్చింది. ఉద్యోగి, సంస్థ.. ఉమ్మడిగా ఇందుకోసం  దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2022 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అధిక పెన్షన్ సదుపాయాన్ని ఈపీఎఫ్‍వో అందుబాటులోకి తెచ్చింది. మార్గదర్శకాలను వెల్లడించింది. 2014 ఆగస్టు 31కు ముందు ఈపీఎస్ స్కీమ్‍లో చేరి కొనసాగుతున్న వారు ఈ అధిక పెన్షన్‍కు అప్లై చేసుకోవచ్చు. 

(1 / 5)

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్‍ఓ తీసుకొచ్చింది. ఉద్యోగి, సంస్థ.. ఉమ్మడిగా ఇందుకోసం  దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2022 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అధిక పెన్షన్ సదుపాయాన్ని ఈపీఎఫ్‍వో అందుబాటులోకి తెచ్చింది. మార్గదర్శకాలను వెల్లడించింది. 2014 ఆగస్టు 31కు ముందు ఈపీఎస్ స్కీమ్‍లో చేరి కొనసాగుతున్న వారు ఈ అధిక పెన్షన్‍కు అప్లై చేసుకోవచ్చు. (EPFO)

2014లో ఈపీఎస్ వేతన గరిష్ఠ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచింది ఈపీఎఫ్‍వో. బేసిక్ శాలరీలోని 8.33 శాతానికి సమామైన మొత్తాన్ని సంస్థలు.. ఈపీఎస్ కోసం జమ చేస్తున్నాయి. 

(2 / 5)

2014లో ఈపీఎస్ వేతన గరిష్ఠ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచింది ఈపీఎఫ్‍వో. బేసిక్ శాలరీలోని 8.33 శాతానికి సమామైన మొత్తాన్ని సంస్థలు.. ఈపీఎస్ కోసం జమ చేస్తున్నాయి. (Mint)

అధిక పెన్షన్ కోసం ఈ ఉమ్మడి దరఖాస్తులను సమర్పించేందుకు అతిత్వరలో యూఆర్ఎల్‍ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పింది ఈపీఎఫ్‍వో. దీని ద్వారా ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూఆర్ఎల్ ద్వారా డిజిటల్‍గా లాగిన్ అయి అప్లికేషన్ సమర్పించవచ్చు. అధిక పెన్షన్ కోసం దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 3 ఆఖరు తేదీగా ఉంది.

(3 / 5)

అధిక పెన్షన్ కోసం ఈ ఉమ్మడి దరఖాస్తులను సమర్పించేందుకు అతిత్వరలో యూఆర్ఎల్‍ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పింది ఈపీఎఫ్‍వో. దీని ద్వారా ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూఆర్ఎల్ ద్వారా డిజిటల్‍గా లాగిన్ అయి అప్లికేషన్ సమర్పించవచ్చు. అధిక పెన్షన్ కోసం దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 3 ఆఖరు తేదీగా ఉంది.(Reuters)

అధిక పెన్షన్ కోసం చేసే ప్రతీ దరఖాస్తు డిజిటల్ రికార్డు అవుతుందని ఈవీఎఫ్‍వో మార్గదర్శకాల్లో ఉంది. దరఖాస్తుదారులకు అప్లికేషన్ రిసిప్ట్ నంబర్‌ను కూడా ఈవీఎఫ్‍వో ఇవ్వనుంది. 

(4 / 5)

అధిక పెన్షన్ కోసం చేసే ప్రతీ దరఖాస్తు డిజిటల్ రికార్డు అవుతుందని ఈవీఎఫ్‍వో మార్గదర్శకాల్లో ఉంది. దరఖాస్తుదారులకు అప్లికేషన్ రిసిప్ట్ నంబర్‌ను కూడా ఈవీఎఫ్‍వో ఇవ్వనుంది. (Mint)

ఈవీఎఫ్‍వో కార్యాలయం ఇన్‍చార్జులు ఈ ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ-మెయిల్, పోస్ట్, ఎస్ఎంఎస్‍ల ద్వారా వారి నిర్ణయాన్ని తెలియజేస్తారు. 

(5 / 5)

ఈవీఎఫ్‍వో కార్యాలయం ఇన్‍చార్జులు ఈ ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ-మెయిల్, పోస్ట్, ఎస్ఎంఎస్‍ల ద్వారా వారి నిర్ణయాన్ని తెలియజేస్తారు. (MINT_PRINT)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు