2022 Round up: 2022లో జరిగిన 5 ఆకస్మిక విషయాలు-2022 year ender unexpected things that happened in 2022 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  2022 Year Ender Unexpected Things That Happened In 2022

2022 Round up: 2022లో జరిగిన 5 ఆకస్మిక విషయాలు

Dec 26, 2022, 04:03 PM IST Chatakonda Krishna Prakash
Dec 26, 2022, 04:03 PM , IST

  • 2022 Round up: కొత్త సంవత్సరం 2023 మరో ఐదు రోజుల్లో వచ్చేస్తోంది. 2022కు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాం. కాగా, 2022లో కొన్ని ఆకస్మిక ఘటనలు జరిగాయి. అంతకు ముందు ఎప్పుడూ ఊహించని విషయాలు చోటుచేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైన 5 విషయాలు ఇవే.

2022 ముగింపునకు వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరిగాయి. ఆర్థిక సంక్షోభాల నుంచి రాజకీయాలు, క్రీడల వరకు చాలా మార్పులు చోటు చేసుకున్నాయు. అయితే అందులో కొన్ని ఊహించని విధంగా ఆకస్మికంగా జరిగాయి. ఇలా 2022లో హఠాత్తుగా జరిగిన ఐదు విషయాలను ఇక్కడ తెలుసుకోండి. 

(1 / 6)

2022 ముగింపునకు వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరిగాయి. ఆర్థిక సంక్షోభాల నుంచి రాజకీయాలు, క్రీడల వరకు చాలా మార్పులు చోటు చేసుకున్నాయు. అయితే అందులో కొన్ని ఊహించని విధంగా ఆకస్మికంగా జరిగాయి. ఇలా 2022లో హఠాత్తుగా జరిగిన ఐదు విషయాలను ఇక్కడ తెలుసుకోండి. (File Photos)

బ్రిటన్‍ ప్రధానిగా తొలిసారి భారత సంతతి వ్యక్తి: బ్రిటన్ ప్రధాన మంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. 2022 అక్టోబర్ 25వ తేదీన ఆయన ఈ పదవి దక్కించుకున్నారు. బ్రిటన్ ప్రధాని పీఠం ఎక్కిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు రిషి.

(2 / 6)

బ్రిటన్‍ ప్రధానిగా తొలిసారి భారత సంతతి వ్యక్తి: బ్రిటన్ ప్రధాన మంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. 2022 అక్టోబర్ 25వ తేదీన ఆయన ఈ పదవి దక్కించుకున్నారు. బ్రిటన్ ప్రధాని పీఠం ఎక్కిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు రిషి.(Bloomberg)

మాంచెస్టర్ యునైటెడ్‍కు రొనాల్డో గుడ్‍బై: ఫుట్‍బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)… మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) క్లబ్‍తో తన అనుబంధానికి వీడ్కోలు పలికాడు. 2022 నవంబర్ 23న ఆ జట్టు నుంచి బయటికి వచ్చాడు. ప్రస్తుతం కొత్త క్లబ్ అన్వేషిస్తున్నాడు రొనాల్డో.

(3 / 6)

మాంచెస్టర్ యునైటెడ్‍కు రొనాల్డో గుడ్‍బై: ఫుట్‍బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)… మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) క్లబ్‍తో తన అనుబంధానికి వీడ్కోలు పలికాడు. 2022 నవంబర్ 23న ఆ జట్టు నుంచి బయటికి వచ్చాడు. ప్రస్తుతం కొత్త క్లబ్ అన్వేషిస్తున్నాడు రొనాల్డో.(REUTERS)

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్: పాపులర్ మైక్రోబ్లాగింగ్, సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ట్విట్టర్‌ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. 44 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు ఈ డీల్ ఎన్నో మలుపులు తిరగగా.. చివరికి ట్విట్టర్‌ను మస్క్ దక్కించుకున్నారు.

(4 / 6)

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్: పాపులర్ మైక్రోబ్లాగింగ్, సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ట్విట్టర్‌ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. 44 బిలియన్ డాలర్లను వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు ఈ డీల్ ఎన్నో మలుపులు తిరగగా.. చివరికి ట్విట్టర్‌ను మస్క్ దక్కించుకున్నారు.(AP)

బ్రిటీష్ రాణిగా సుదీర్ఘ కాలం పాలించిన ఎలిజబెత్ 2 (Queen Elizabeth II) ఈ ఏడాది కన్నుమూశారు. 2022 సెప్టెంబర్ 8 తేదీన స్కాట్లాండ్‍లోని నివాసంలో ఆమె మృతి చెందారు.  

(5 / 6)

బ్రిటీష్ రాణిగా సుదీర్ఘ కాలం పాలించిన ఎలిజబెత్ 2 (Queen Elizabeth II) ఈ ఏడాది కన్నుమూశారు. 2022 సెప్టెంబర్ 8 తేదీన స్కాట్లాండ్‍లోని నివాసంలో ఆమె మృతి చెందారు.  (AFP)

శ్రీ లంక ఆర్థిక సంక్షోభం: ఎవరూ ఊహించని విధంగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం (Sri Lankas economic crisis) తలెత్తింది. ద్రవ్యోల్బణం గణనీయంగా అధికమై.. ఆ దేశంలో నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్‍తో పాటు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని కమ్మేసింది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం సాగులో రసాయనిక ఎరువులపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం వికటించి.. సంక్షోభానికి దారి తీసింది. 

(6 / 6)

శ్రీ లంక ఆర్థిక సంక్షోభం: ఎవరూ ఊహించని విధంగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం (Sri Lankas economic crisis) తలెత్తింది. ద్రవ్యోల్బణం గణనీయంగా అధికమై.. ఆ దేశంలో నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్‍తో పాటు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని కమ్మేసింది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం సాగులో రసాయనిక ఎరువులపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం వికటించి.. సంక్షోభానికి దారి తీసింది. (File Image)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు