Bamboo crash barrier:స్టీల్ తో కాదు.. వెదురుతో రూపొందిన బాహుబలి క్రాష్ బ్యారియర్
Bamboo crash barrier: సాధారణంగా రహదారుల్లో కనిపించే క్రాష్ బ్యారియర్లు స్టీల్ తో తయారు చేస్తారు. కానీ ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా తొలిసారి వెదురుతో క్రాష్ బ్యారియర్ (bamboo crash barrier) ను తయారు చేశారు.
Bamboo crash barrier: రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసే క్రాష్ బ్యారియర్స్ ను సాధారణంగా ఉక్కుతో తయారుచేస్తారు. భారత్ లో తొలిసారి ఉక్కుతో కాకుండా, పర్యావరణ హితమైన వెదురుతో క్రాష్ బ్యారియర్స్ (bamboo crash barrier) ను తయారు చేశారు. ప్రపంచంలోనే వెదురుతో తయారైల తొలి క్రాష్ బ్యారియర్స్ ఇవి.
Bamboo crash barrier: మహారాష్ట్రలో తొలిసారి..
మహారాష్ట్రలో చంద్రపూర్, యావత్మల్ జిల్లాలను కలిపే వణి - వరొరా హైవే (Vani-Warora Highway) పై 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బ్యారియర్స్ (bamboo crash barrier) ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఒదొక అసాధారణ ప్రయోగమని కొనియాడారు. ఈ వెదురు క్రాష్ బ్యారియర్ (bamboo crash barrier) ఉక్కుకు సరైన ప్రత్యామ్నాయమని, అలాగే, పర్యావరణానికి, వెదురు (bamboo industry)) పరిశ్రమకు ప్రయోజనకరమని వివరించారు. ప్రపంచంలోనే ఇలా వెదురుతో క్రాష్ బ్యారియర్స్ (bamboo crash barrier) తయారు చేయడం మొదటి సారని వెల్లడించారు. ఆత్మ నిర్బర్ భారత్ కు ఇదొక అద్భుత నిదర్శనమని ట్వీట్ చేశారు.
Bamboo crash barrier: బాహుబలి క్రాష్ బ్యారియర్..
ఈ వెదురు క్రాష్ బ్యారియర్ కు నితిన్ గడ్కరీ బాహు బలి క్రాష్ బ్యారియర్ (Bahu Bali crash barrier) అని పేరు పెట్టారు. నేషనల్ ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సహా పలు ప్రభుత్వ సంస్థలు ఈ వెదురు క్రాష్ బ్యారియర్ ను పరీక్షించాయని గడ్కరీ వెల్లడించారు. అన్ని పరీక్షలను ఈ బాహుబలి బ్యారియర్ విజయవంతంగా తట్టుకుందని తెలిపారు. రూర్కీలోని సీబీఆర్ఐ (Central Building Research Institute CBRI) ఫైర్ రేటింగ్ టెస్ట్ లో ఇది క్లాస్ 1 గా రేటింగ్ పొందిందన్నారు. ఈ వెదురు క్రాష్ బ్యారియర్ (bamboo barrier) రీసైక్లింగ్ వాల్యూ కూడా స్టీల్ కన్నా ఎక్కువేనన్నారు. వెదురు బ్యారియర్ రీసైక్లింగ్ వాల్యూ 50% నుంచి 70% ఉంటుందని, అదే ఉక్కు (steel) బ్యారియర్ రీసైక్లింగ్ వాల్యూ 30% నుంచి 50% మాత్రమే ఉంటుందని మరో ట్వీట్ లో గడ్కరీ వివరించారు. ఈ వెదురు క్రాష్ బ్యారియర్ ను బాంబూసా బల్కొవా (Bambusa Balcoa) రకం వెదురుతో తయారు చేశారని వెల్లడించారు. ఆ తరువాత వాటికి క్రియొసోట్ (CREOSOTE) ఆయిల్ తో శుద్ధి చేసి, హై డెన్సిటీ పాలీ ఇధిలీన్ (High-Density Poly Ethylene HDPE) తో కోటింగ్ ఇచ్చారని గడ్కరీ వివరించారు.