Pawan Khera: ఎవరీ పవన్ ఖేరా? ప్రధాని మోదీని ఏమన్నాడని అరెస్ట్ చేశారు?-why was congress leader pawan khera arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Why Was Congress Leader Pawan Khera Arrested?

Pawan Khera: ఎవరీ పవన్ ఖేరా? ప్రధాని మోదీని ఏమన్నాడని అరెస్ట్ చేశారు?

HT Telugu Desk HT Telugu
Feb 23, 2023 05:12 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Congress leader Pawan Khera) అరెస్ట్ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మరో మాటల యుద్ధానికి తెరతీసింది.

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా

అస్సాంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Congress leader Pawan Khera) ను ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి చత్తీస్ గఢ్ లోని రాయిచూర్ వెళ్తుండగా, విమానం బయల్దేరే ముందు ఢిల్లీ పోలీసులు ఆయనను ఇండిగో (indigo) విమానం నుంచి బలవంతంగా దింపి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు అస్సాం పోలీసుల నుంచి వచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Supreme court grants bail to Khera: సుప్రీంకోర్టు బెయిల్..

పవన్ ఖేరా (Pawan Khera)ను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ (Congress) తీవ్రంగా మండిపడింది. మోదీ మార్కు దమన నీతికి ఇది తార్కాణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై బీజేపీ (BJP) దాడి చేస్తోందని ఆరోపించింది. పవన్ ఖేరా (Pawan Khera) అరెస్ట్ పై హుటాహుటిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా తమ పిటిషన్ ను విచారించాలని సుప్రీంకోర్టును కోరింది. దాంతో, మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు (suprene పవన్ ఖేరా (Pawan Khera) కు ఫిబ్రవరి 28 వరకు బెయిల్ మంజూరు చేసింది.

Hindenburg research: హిండెన్ బర్గ్ నివేదిక

ఈ నేపథ్యంలో పవన్ ఖేరా (Pawan Khera) ప్రధాని మోదీని అవమానిస్తూ ఎమన్నారనే ఆసక్తి అంతటా వ్యక్తమవుతోంది. ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫెరెన్స్ లో.. ఇటీవల స్టాక్ మార్కెట్ ను కుదిపేసిన హిండెన్ బర్గ్ (Hindenburg) నివేదిక గురించి కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడారు. తో ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా నిలిచిన ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ (Goutam Adani) ఆస్తులు ఒక్కసారిగా ఆవిరైపోయిన విషయం తెలిసిందే. ఆ నివేదిక (Adani-Hindenburg row) వెల్లడైన జనవరి 24 నుంచి ఆదానీ గ్రూప్ షేర్ల విలువ రోజురోజుకీ తగ్గిపోతోంది.

Why Pawan Khera arrested? ఎందుకు అరెస్ట్?

అస్సాంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస నేత పవన్ ఖేరా (Pawan Khera) మాట్లాడుతూ.. హిండెన్ బర్గ్ నివేదికలో గౌతమ్ ఆదానీపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని (joint parliamentary Committee JPC) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘విపక్షాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు పీవీ నరసింహరావు జేపీసీని ఏర్పాటు చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి కూడా జేపీసీని ఏర్పాటు చేశారు. మరి హిండెన్ బర్గ్ నివేదికపై జేపీసీని ఏర్పాటు చేయడానికి నరేంద్ర ‘గౌతమ్’ దాస్ మోదీ.. సారీ.. నరేంద్ర దామోదర దాస్ మోదీ కి ఏంటీ సమస్య? (Narendra Gautam Das...sorry Damodardas...Modi)’’ అని పవన్ ఖేరా (Pawan Khera) వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ (PM Modi) పూర్తి పేరు నరేంద్ర దామోదర దాస్ మోదీ కాగా, పవన్ ఖేరా నరేంద్ర గౌతమ్ దాస్ మోదీ అని అన్నారు. గౌతమ్ ఆదానీ, మోదీ (PM Modi) కి సన్నిహితుడైన మిత్రుడనే అర్థం స్ఫురించేలా ఆయన అలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైననే పవన్ ఖేరాపై అస్సాంలో, యూపీలో కేసులు నమోదయ్యాయి. అత్యంత గౌరవనీయ పదవిలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) ని పవన్ ఖేరా అవమానించారని, తన తండ్రి పేరు స్థానంలో వేరే వ్యక్తి పేరును కావాలనే ప్రస్తావించారని ఆ ఫిర్యాదుల్లో బీజేపీ (BJP) పేర్కొంది. దాంతో, పవన్ ఖేరా అరెస్ట్ కు రంగం సిద్ధమైంది.

IPL_Entry_Point