Most searched on Google in 2022: గూగుల్ సెర్చ్ 2022 రికార్డ్స్ ఇవే..-who were the most searched on google in 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Who Were The Most Searched On Google In 2022?

Most searched on Google in 2022: గూగుల్ సెర్చ్ 2022 రికార్డ్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu
Dec 31, 2022 10:37 PM IST

Most searched on Google in 2022: 2022 సంవత్సరంలో ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన అంశాలేమిటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

Most searched on Google in 2022: గూగుల్ సెర్చ్() లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నెటిజన్లు వెతికిన పదం (most searched word) వర్డ్ లి(Wordle). నెటిజన్లు ఈ సంవత్సరం ఈ పదం గురించే ఎక్కువగా సెర్చ్ చేశారట.

Most searched on Google in 2022: గూగుల్ సెర్చ్ లో ట్రెండింగ్ లో ఉన్నవి ఇవే..

  • అలాగే, గూగుల్ సెర్చ్ లో 2022లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన వార్తాంశం(most searched news) ఉక్రెయిన్(Ukraine). రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం ప్రధాన వార్తాంశంగా ఉంటోంది.
  • గూగుల్ సెర్చ్ లో 2022లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన ప్రముఖుడు(most searched celebrity) జానీ డెప్(Johnny Depp). అంబర్ హర్డ్ తో విడాకుల వార్తతో ఈ సెలబ్రిటీ యాక్టర్ ఈ సంవత్సరం వార్తల్లో నిలిచారు.
  • మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు వెతికిన మరణ వార్త క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంబంధించిన వార్త.

IPL_Entry_Point

టాపిక్