Himachal Pradesh CM : హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం ఎవరు.. రేసులో ఉన్నదెంతమంది?-who is next cm of himachal pradesh here s some details for you ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Who Is Next Cm Of Himachal Pradesh Here's Some Details For You

Himachal Pradesh CM : హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం ఎవరు.. రేసులో ఉన్నదెంతమంది?

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 10:33 PM IST

Himachal Pradesh Next CM : హిమాచల్ ​ప్రదేశ్​లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది హస్తం పార్టీ. మరీ ఇక్కడ సీఎం అభ్యర్థి ఎవరు? రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక క్యాంపు రాజకీయం మెుదలుపెట్టింది కాంగ్రెస్.

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం
హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం

హిమచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ సీఎం అభ్యర్థి ఎవరు? పేర్లేమో చాలమందివి వినిపిస్తున్నాయి. తమకు తాము సీఎం అనిచెప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ రేసులో ఐదుగురి పేర్లు ఎక్కువగా విపిస్తున్నాయి. సీఎం అభ్యర్థిని నిర్ణయించడం కంటే.. ముందు ఏ ఒక్క ఎమ్మెల్యే చేయి జారీ పోవద్దని.. హస్తం పార్టీ అనుకుంటోంది. దీంతో క్యాంపు రాజకీయం మెుదలుపెట్టింది. సీఎం అభ్యర్థిని(CM Canidate) నిర్ణయించే పనిలో హైకమాండ్ ఉంది. కానీ కాస్త తలనొప్పిగా ఈ విషయం మారినట్టుగా కనిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

హిమచల్ కాంగ్రెస్ పార్టీలో సీఎం రేసులో ఒకరో.. ఇద్దరో ఉంటే.. ఇప్పటికే ఎవరొ ఒకరిని బుజ్జగించేదేమో అధిష్టానం. కానీ సీఎం అభ్యర్థిగా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధిష్టానం దగ్గరకు పైరవీలు వెళ్తున్నాయి. ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఆలోచనలో పడింది కాంగ్రెస్(Congress). ఎమ్మెల్యేలు చేయిజారి పోకుండా.. చండీగఢ్ కు తరలిస్తోంది. ఐదుగురి పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అందులో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు.

ఈ పేర్లలో ఎవరి పేరు ఫైనల్ కానుందో అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. లేదంటే.. మరో కొత్త పేరు తెరపైకి వస్తుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనుంది అధిష్టానం. ఆపై అభ్యర్థిని నిర్ణయించున్నారు. ఎవరికి లాటరీ తగలనుందో అనే అంశం ఆసక్తిగా మారింది. బీజేపీ((BJP) ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేదని.. పార్టీని ఎగతాళి కూడా చేశారు.

ప్రతిభా సింగ్ .. ఈమె వీరభద్ర సింగ్ భార్య. 3 దశాబ్దాలుగా హిమాచల్ లో కాంగ్రెస్ అంటే వీరభద్ర సింగ్ మాత్రమేనని చెబుతుంటారు. ప్రతిభా.. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మండి ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. తన భర్త దివంగత వీరభద్ర సింగ్(Veera Bhadra Singh) చేసిన పనిని చూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని ఆమె అంటున్నారు. ఆయనలాగే పరిపాలన అందిస్తానని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. 'ముఖ్యమంత్రిపై కాంగ్రెస్‌లో ఎలాంటి గొడవలు లేవు.' అని ఆమె పునరుద్ఘాటించారు.

సుఖ్వీందర్ సింగ్ సుఖు.. హిమాచల్ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు. హిమాచల్ ప్రదేశ్‌లోని నదౌన్ అసెంబ్లీ(Assembly) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి అత్యంత సన్నిహితుడు. తనలాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం దగ్గర చెబుతున్నారు. ముఖేష్ అగ్నిహోత్రి.. ఈయన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఉనా జిల్లాలోని హరోలి స్థానం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరభద్ర సింగ్ ప్రభుత్వంలో ఆయన క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు.

ఠాకూర్ కౌల్ సింగ్.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలోని దర్రాంగ్ అసెంబ్లీ స్థానం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరభద్ర సింగ్ కుటుంబానికి సన్నిహితుడు. ముఖ్యమంత్రి పదవికి నామినేట్ చేస్తే.. విధేయుడిగా ఉన్నందున అతని అభ్యర్థిత్వానికి ప్రతిభా సింగ్.. మద్దతు ఇవ్వవచ్చు. రేసులో ఆశా కుమారి(Asha Kumari) కూడా ఉన్నారు. చత్తీస్ ఘడ్ మంత్రి టీఎస్ సింగ్ కు సోదరి. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు మేనకోడలు కూడా.

ఇలా సీఎం పదవి కోసం పలువురు రేసులో ఉన్నారు. అధిష్ఠానం నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ సీఎం అభ్యర్తి ఎవరని.. బీజేపీ ప్రచార దాడి చేసింది. అయితే ఇప్పుడు సీఎం రేసులో మాత్రం చాలా మంది ఉన్నారు.

IPL_Entry_Point