Pak new Army chief: పాక్ ఆర్మీ చీఫ్ గా ఐఎస్ఐ మాజీ చీఫ్-who is lt gen asim munir pak pm s pick for new army chief ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pak New Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ గా ఐఎస్ఐ మాజీ చీఫ్

Pak new Army chief: పాక్ ఆర్మీ చీఫ్ గా ఐఎస్ఐ మాజీ చీఫ్

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 05:24 PM IST

పాకిస్తాన్ సైనిక దళాల నూతన ప్రధానాధికారిగా లెఫ్ట్ నెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ నియమితులయ్యారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బద్ధ విరోధిగా ఈయనకు పేరుంది.

పాక్ ఆర్మీ న్యూ చీఫ్ లెఫ్ట్ నెంట్ జనరల్ ఆసిమ్ మునీర్
పాక్ ఆర్మీ న్యూ చీఫ్ లెఫ్ట్ నెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ (ANI photo)

Pak new Army chief: పాక్ ఆర్మీ చీఫ్ గా లెఫ్ట్ నెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ నియమించారు. అలాగే, కీలకమైన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ గా లెఫ్ట్ నెంట్ జనరల్ సాహిర్ శంషాద్ ను నియమించారు. ఈ రెండు నియామకాలను అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది.

Pak new Army chief: జనరల్ బాజ్వా పై అవినీతి ఆరోపణలు

ప్రస్తుతం జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. ఆయనపై ఇటీవల పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన, ఆయన కుటుంబ సభ్యలు లెక్కకు మించిన అక్రమాస్తులు సంపాదించారని, అక్రమ ఆదాయాన్ని విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. జనరల్ బాజ్వా ఈ నవంబర్ 29న రిటైర్ అవుతున్నారు. దాంతో, ఆయన స్థానంలో లెఫ్ట్ నెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ కు అవకాశం కల్పించారు.

Pak new Army chief: పుల్వామా దాడి సమయంలో..

2019లో జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో భారత సీఆర్పీఎఫ్ దళాలపై పాక్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్ర దాడి సమయంలో ఈ ఆసిమ్ మునీర్ ఐఎస్ఐ(Inter-Services Intelligence ISI)చీఫ్ గా ఉన్నారు. ఆ దాడి తరువాతనే భారత్, పాక్ ల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆ దాడిలో 40 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐఎస్ఐ చీఫ్ గా కీలక మిలటరీ నిర్ణయాల్లో మునీర్ పాత్ర ఉంది. లెఫ్ట్ నెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ ISI చీఫ్ గా ఉన్న సమయంలోనే అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో విబేధాలు ప్రారంభమయ్యాయి. మునీర్ ది ఎవ్వరినీ లెక్కచేయని తత్వమని, కొన్ని నిర్ణయాల విషయంలో వారిద్ధరి మధ్య విబేధాలు ప్రారంభమై, అనంతరం అవి మరింత ముదిరాయని పాక్ వర్గాలు వెల్లడించాయి. తనను పదవి నుంచి తొలగించడంలో పాక్ ఆర్మీ కుట్రే కీలకమని ఇమ్రాన్ కూడా పలు సందర్భాల్లో ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా, మునీర్ కు ఆర్మీ చీఫ్ గా పదోన్నతి కల్పించడం ఇమ్రాన్ కు చెక్ చెప్పడంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు.

IPL_Entry_Point