Missouri Walmart fight : షాపింగ్​ మాల్​లో రచ్చ.. 20మంది కొట్టుకున్నారు!-violent fight involving over a dozen customers erupts at missouri walmart ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Violent Fight Involving Over A Dozen Customers Erupts At Missouri Walmart

Missouri Walmart fight : షాపింగ్​ మాల్​లో రచ్చ.. 20మంది కొట్టుకున్నారు!

Sharath Chitturi HT Telugu
Oct 15, 2022 09:22 AM IST

Missouri Walmart fight : షాపింగ్​ మాల్​లో 20మందికి పైగా కస్టమర్లు కొట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

షాపింగ్​ మాల్​లో కొట్టుకున్న కస్టమర్లు!
షాపింగ్​ మాల్​లో కొట్టుకున్న కస్టమర్లు!

Missouri Walmart fight : అమెరికా వాల్​మార్ట్​ స్టోర్​కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 20కిపైగా కస్టమర్లు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరి మీద మరొకరు పడి పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు.

మిస్సౌరిలోని వాల్ట్​మార్ట్​ స్టోర్​లో మంగళవారం జరిగింది ఈ ఘటన. సెల్ఫ్​ చెకౌట్​ ఏరియాలో కస్టమర్లు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరిని మరొకరు కాలితో తన్నారు. ముఖం మీద కొట్టారు. పక్కనే ఉన్న వస్తువులను తీసుకుని విసురుకున్నారు.

ఈ ఘటనపై ఫెర్గూసన్​ పోలీస్​ చీఫ్​ ఫ్రాంక్​ మెక్​కాల్​ స్పందించారు.

"ఇదొక సిగ్గు చేటు ఘటన. 10-25మంది వరకు గొడవ పడ్డారు. గొడవ తర్వాత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వాల్​మార్ట్​లోనే దానిని పరిష్కరించుకున్నారు," అని ఫ్రాంక్​ పేర్కొన్నారు.

Walmart fight viral video : గొడవ పడిన వాళ్లు.. ఒకరికి ఒకరు ముందే తెలుసు!

"గొడవలో పాల్గొన్న వారిలో కొందరిని పట్టుకున్నాము. వారిలో చాలా మందికి ఒకరికి ఒకరు తెలుసు. అయినా దారుణంగా కొట్టుకున్నారు. ఘటనలో వాల్​మార్ట్​కు కూడా నష్టం జరిగింది. ఈ వ్యవహారంపై వాల్​మార్ట్​ కేసు నమోదు చేస్తుందని ఆశిస్తున్నాను," అని ఫ్రాంక్​ వెల్లడించారు.

స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్​ చయలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై వాల్​మార్ట్​ కూడా బహిరంగంగా స్పందించలేదు. కస్టమర్ల భద్రతే తమకు ముఖ్యమని మాత్రం వెల్లడించింది.

అసలు ఎందుకు గొడవ జరిగింది? అన్న విషయంపై స్పష్టత రాలేదు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

ఇటీవలి కాలంలో షాపింగ్​ మాల్స్​లో గొడవలు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు అనేక మంది గొడవల్లోకి దిగి గాయాల పాలవుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తెగ వైరల్​ అవుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం