Gang rape in car: లిఫ్ట్ ఇచ్చి కారులో గ్యాంగ్ రేప్-teenage girl gang raped in car in nagpur two held and woman jumps off moving bus to save herself from rape attempt in another case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Teenage Girl Gang-raped In Car In Nagpur Two Held And Woman Jumps Off Moving Bus To Save Herself From Rape Attempt In Another Case

Gang rape in car: లిఫ్ట్ ఇచ్చి కారులో గ్యాంగ్ రేప్

HT Telugu Desk HT Telugu
Jan 26, 2023 05:12 AM IST

Gang rape in car: కారులో లిఫ్ట్ ఇచ్చి ఓ టీనేజ్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఉదంతం ఇది.

The complainant said his daughter had gone missing while playing outside the house with other children. He started searching for her and when he went to the room of the accused, he saw his daughter being raped. Ludhiana police lodged an FIR under Sections 376- A, B (rape on woman under 12 years of age) of IPC and Section 6 of POCSO Act and arrested the accused. (HT FILE PHOTO)
The complainant said his daughter had gone missing while playing outside the house with other children. He started searching for her and when he went to the room of the accused, he saw his daughter being raped. Ludhiana police lodged an FIR under Sections 376- A, B (rape on woman under 12 years of age) of IPC and Section 6 of POCSO Act and arrested the accused. (HT FILE PHOTO) (HT_PRINT)

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఓ టీనేజ్ బాలికపై ఇద్దరు వ్యక్తులు వాహనంలో లిఫ్ట్ ఇచ్చి అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలోని సావోనర్ ప్రాంతంలో ఈ ఘటన జరగగా, నిందితులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. నిందితులు 17 ఏళ్ల బాధితురాలికి తమ కారులో లిఫ్ట్ ఇచ్చి, వాహనాన్ని ఏకాంత ప్రదేశంలో పార్క్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

రేప్ నుంచి తప్పించుకునేందుకు బస్సు నుంచి దూకిన మహిళ

కాగా మరో మహిళ రేప్ నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న బస్సు నుంచి దూకిన ఘటన చోటు చేసుకుంది.

డార్జిలింగ్‌కు చెందిన మహిళ బీహార్‌లోని పూర్నియాలో కదులుతున్న బస్సు నుండి దూకి అత్యాచార యత్నం నుండి తనను తాను రక్షించుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైందని పోలీసులు బుధవారం తెలిపారు.

బైసి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమీర్ జావైద్ కథనం ప్రకారం.. అర్ధరాత్రి తరువాత హైవే రోడ్డులో గాయపడిన ఆ మహిళను పోలీసులు గుర్తించారు.

‘అర్ధరాత్రి తర్వాత రోడ్డుపై గాయపడిన స్థితిలో పడి ఉన్న మహిళను పోలీసులు చూశారు. తాను వైశాలి నుండి సిలిగురికి బస్సులో ప్రయాణిస్తుండగా, కొంతమంది వ్యక్తులు తనను వేధించడానికి ప్రయత్నించినప్పుడు, తనను తాను రక్షించుకోవడానికి ఆమె కదులుతున్న బస్సు నుండి దూకింది..’ అని ఎస్పీ వివరించారు. బాధితురాలిని ముందుగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం పూర్నియా మెడికల్ కాలేజీకి తరలించారు.

తలకు గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని పూర్నియా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సికె సిన్హా తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

IPL_Entry_Point

టాపిక్