Stray dog attack : రెచ్చిపోయిన వీధి కుక్కు.. 70మందికి తీవ్ర గాయాలు!-stray dog goes on biting spree in bihar s ara attacks 70 people ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Stray Dog Goes On Biting Spree In Bihar's Ara, Attacks 70 People

Stray dog attack : రెచ్చిపోయిన వీధి కుక్కు.. 70మందికి తీవ్ర గాయాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 27, 2023 08:14 AM IST

Stray dog attacked people in Bihar : బిహార్​లో ఓ వీధి కుక్క.. 70మందిని కరిచేసింది! పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. అక్కడి స్థానికులను భయపెట్టింది.

రెచ్చిపోయిన వీధి కుక్కు.. 70మందికి తీవ్ర గాయాలు!
రెచ్చిపోయిన వీధి కుక్కు.. 70మందికి తీవ్ర గాయాలు! (HT_PRINT/file)

Stray dog attacked people in Bihar : దేశంలో వీధి కుక్కలతో వస్తున్న సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీధి కుక్క దాడుల్లో గాయాల పాలవుతున్న ప్రజల సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా.. బీహార్​లో జరిగిన ఓ ఘటన కలకలం సృష్టించింది. అరా పట్టణంలోని పలు ప్రాంతంలో.. ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. 70కిపైగా మందిని కరిచింది!

ట్రెండింగ్ వార్తలు

వీధి కుక్క కోసం వేట..!

శివ్​గంజ్​, షిట్లా టోలా, మహదేవ్​ రోడ్డు, సదర్​ హాస్టిటల్​ ప్రాంతాల్లో బుధవారం.. ఓ వీధి కుక్క ప్రజలను కరిచినట్టు.. భోజ్​పూర్​ ఎస్​పీ ప్రమోద్​ కుమార్​ వెల్లడించారు. గాయపడిన వారందరు స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు వివరించారు.

Bihar stray dog attack news : ప్రజలపై దాడి చేసిన అనంతరం ఆ కుక్క కనిపించకుండా పోయింది. కుక్కను పట్టుకునేందుకు అటు పోలీసులు.. ఇటు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని ఎస్​పీ వివరించారు. ప్రజల భద్రత కోసం ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీని సైతం పెంచినట్టు స్పష్టం చేశారు.

బాలికపై దాడి..!

వీధి కుక్క దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడిన ఘటన గుజరాత్​ సూరత్​లో ఇటీవలే చోటుచేసుకుంది. బాలిక తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో.. వీధి కుక్క వచ్చి ఆమెను కరించింది. ఆ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. బాలికను కరిచిన కుక్క.. ఆమె మొహం నుంచి చర్మాన్ని లాగేసింది!

Stray dog attacks girl in Gujarat : కుక్క దాడి చేయడాన్ని చూసిన బాలిక తల్లి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. చివరికి ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అనంతరం ఆ బాలిక స్థానిక ఆసుపత్రిలో చేరింది. బాలిక ముఖంపై చాలా కుట్లు పడినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం