Stock market | లాభాల్లో దేశీయ సూచీలు.. వరుస నష్టాలకు బ్రేక్​!-stock market today sensex and nifty open higher ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market | లాభాల్లో దేశీయ సూచీలు.. వరుస నష్టాలకు బ్రేక్​!

Stock market | లాభాల్లో దేశీయ సూచీలు.. వరుస నష్టాలకు బ్రేక్​!

HT Telugu Desk HT Telugu
May 13, 2022 09:29 AM IST

Stock market today | దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. సెనెక్స్​ 400 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్ల మేర వృద్ధి చెందాయి.

స్టాక్​ మార్కెట్​
స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market today | వరుస నష్టాల అనంతరం దేశీయ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సూచీలకు సానుకూల పవనాలు అందాయి. ఫలితంగా బీఎస్​ఈ సెన్సెక్స్​ ప్రస్తుతం 401పాయింట్లు వృద్ధి చెంది 53,331 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 127పాయింట్లు బలపడి.. 15,935 వద్ద ట్రేడ్​ అవుతోంది.

గత సెషన్​లో 52,930 వద్ద ముగిసిన సెన్సెక్స్​.. శుక్రవారం 53,566 వద్ద ఓపెన్​ అయ్యింది. ఇక 15,808 వద్ద ముగిసిన నిఫ్టీ.. 15,977 వద్ద శుక్రవారం సెషన్​ను ప్రారంభించింది.

లాభాలు.. నష్టాలు..

సన్​ఫార్మా, టైటాన్​ షేర్లు 2శాతం మేర లాభపడ్డాయి. బజాజ్​ ఫినాన్స్​, ఎం అండ్​ ఎం, బజాజ్​ ఫిన్​సర్వ్​, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, రిలయన్స్​ షేర్లు 1శాతం మేర వృద్ధి చెందాయి.

ఎల్​ అండ్​ టీ, ఎన్​టీపీసీ, ఎయిర్​టెల్​ షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపుపై ఊహాగానాల నేపథ్యంలో అమెరికా స్టాక్​ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగాయి. డాలరు విలువ 20ఏళ్ల గరిష్ఠం వద్దే కొనసాగుతోంది.

కాగా.. ఆసియా మార్కెట్లు మాత్రం ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయి. జపాన్​ నిక్కీ 2.62శాతం పెరిగింది. ఆస్ట్రేలియా షేర్లు 1.56శాతం వృద్ధి చెందాయి. చైనాలోని సీఎస్​ఐ300 సూచీ 0.92శాతం మేర పెరిగింది. హాంగ్​కాంగ్​ సూచీ 1.8శాతం వృద్ధి చెందింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్