SSC exam 2022 : సీహెచ్​ఎస్​ఎల్​, హెడ్​ కానిస్టేబుల్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల-ssc exam 2022 schedule for chsl head constable mts released check here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ssc Exam 2022, Schedule For Chsl, Head Constable, Mts Released, Check Here

SSC exam 2022 : సీహెచ్​ఎస్​ఎల్​, హెడ్​ కానిస్టేబుల్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

Sharath Chitturi HT Telugu
Aug 06, 2022 07:02 AM IST

SSC exam 2022 : సీహెచ్​ఎస్​ఎల్​, హెడ్​ కానిస్టేబుల్​ పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది. ఆ వివరాలు..

వివిధ పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసిన ఎస్​ఎస్​సీ
వివిధ పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసిన ఎస్​ఎస్​సీ (Mint)

SSC exam 2022 : 2022 ఎస్​ఎస్​సీ పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసింది స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​. సీహెచ్​ఎస్​ఎల్​, హెడ్​ కానిస్టేబుల్​, ఎంటీఎస్​ పరీక్షల తేదీల వివరాలను అభ్యర్థులు.. ssc.nic.in లో చూసుకోవచ్చు.

షెడ్యూల్​ ప్రకారం.. 2021 కంబైన్డ్​ హైయర్​ సెంకడరీ(10+2) స్థాయి టైర్​ 2 పరీక్ష.. 2022 సెప్టెంబర్​ 18న జరుగుతుంది. ఢిల్లీ పోలీస్​లో హెడ్​ కానిస్టేబుల్​(మినిస్ట్రియల్​) పరీక్షలు అక్టోబర్​ 10-20 మధ్యలో జరుగుతాయి. ఇక 2021 మల్టీ టాస్కింగ్​ (నాన్​ టెక్నికల్​) స్టాఫ్​, హవాల్దార్​(సీబీఐసీ- సీబీఎన్​) పరీక్ష.. నవంబర్​ 6న ఉంటుంది.

SSC head constable recruitment 2022 : కాగా.. కొవిడ్​ సంక్షోభంపై ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలపై పరీక్షల తేదీలు ఆధారపడి ఉంటాయని ఎస్​ఎస్​ఈ నోటీసు జారీ చేసింది. అందువల్ల.. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్​సైట్​ను పరిశీలిస్తూ ఉండాలని సూచించింది.

2022 ఎస్​ఎస్​సీ మల్టీ టాస్కింగ్​ స్టాఫ్​ ఎగ్జామినేషన్​ పరీక్షల 'కీ' ని ఇటీవలే విడుదల చేశారు. కీని పరిశీలించిన అనంతరం అభ్యంతరాలుంటే తెలపాలని వెల్లడించారు. ఈ నెల 7 వరకు సమయాన్ని ఇచ్చారు. ఈ ఏడాది జులై 5 నుంచి 22 మధ్యలో ఎస్​ఎస్​సీ ఎంటీఎస్​ పరీక్షలు జరిగాయి. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత.. పరీక్షల ఫలితాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్​, అక్టోబర్​లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్