SpiceJet problem | `స్పైస్ జెట్‌`లో మ‌ళ్లీ స‌మ‌స్య‌-spicejet aircraft develops nose wheel snag in dubai recovery aircraft sent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Spicejet Aircraft Develops Nose Wheel Snag In Dubai, Recovery Aircraft Sent

SpiceJet problem | `స్పైస్ జెట్‌`లో మ‌ళ్లీ స‌మ‌స్య‌

HT Telugu Desk HT Telugu
Jul 12, 2022 05:47 PM IST

విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు స‌మ‌స్య‌లు వెన్నాడుతున్నాయి. తాజాగా, మ‌రో స్పైస్‌జెట్ విమానంలో స‌మ‌స్య త‌లెత్తింది. ప్ర‌యాణీకుల ప్రాణాల‌తో ఆడుకుంటోంద‌ని స్పైస్‌జెట్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

స్పైస్‌జెట్‌ విమానం
స్పైస్‌జెట్‌ విమానం

స్పైస్ జెట్ విమానాల్లో స‌మ‌స్య‌లు సాధార‌ణ‌మ‌య్యాయి. టేకాఫ్‌కు ముందో, లేక టేకాఫ్ త‌రువాతో, లేక ల్యాండింగ్‌కు ముందో, ప్రయాణీకుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌డం ఆ బ‌డ్జెట్ విమాన‌యాన సంస్థ‌కు అల‌వాట‌యింది.

ట్రెండింగ్ వార్తలు

SpiceJet problem | నోస్‌వీల్‌లో స‌మ‌స్య‌

తాజాగా, దుబాయి నుంచి మధురై రావాల్సిన స్పైస్ జెట్ విమానంలో స‌మ‌స్య త‌లెత్త‌డంతో విమానం బ‌య‌ల్దేర‌డం ఆల‌స్యమ‌యింది. చివ‌రి నిమిషంలో విమానం ముందు వీల్‌లో స‌మ‌స్య‌ను గుర్తించారు. దాంతో, ప్ర‌త్యామ్నాయంగా మ‌రో విమానాన్ని ఏర్పాటు చేశారు. దాంతో, విమానం బ‌య‌ల్దేర‌డం ఆల‌స్య‌మైంది. స్పైస్‌జెట్ వినియోగిస్తున్న బోయింగ్ బీ 737 విమానాల్లో ఏదో ఒక స‌మ‌స్య ఎదుర‌వుతోంద‌ని స్పైస్‌జెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

SpiceJet problem | 24 రోజుల్లో 9వ ఘ‌ట‌న‌

స్పైస్‌జెట్ విమానాల్లో స‌మ‌స్య‌లు సాధార‌ణ‌మ‌య్యాయి. స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌డం గ‌త 24 రోజుల్లో రికార్డు స్థాయిలో 9 సార్లు జ‌రిగింది. తాజా ఘ‌ట‌న 9వ‌ది. ``విమానాలు ఆల‌స్యం కావ‌డం ఏ విమాన‌యాన సంస్థ‌లో అయినా సాధార‌ణ‌మే. ప్రయాణీకుల భ‌ద్ర‌త‌కు సంబ‌ధించి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం`` అని స్పైస్‌జెట్ అధికార ప్ర‌తినిధి తెలిపారు. స్పైస్‌జెట్ విమానాల్లో వ‌రుస‌గా స‌మ‌స్య‌లు త‌లెత్తుతుండ‌డంతో ఇప్ప‌టికే డీజీసీఏ ఆ విమాన‌యాన సంస్థ‌కు నోటీసులు జారీ చేసింది. ఇంట‌ర్న‌ల్ సేఫ్టీ సిస్ట‌మ్‌ను రివ్యూ చేసుకోవాల‌ని సూచించింది. గ‌త నాలుగు వారాల వ్య‌వ‌ధిలోపే 9 ప్ర‌మాద‌క‌ర సాంకేతిక స‌మ‌స్య‌లు స్పైస్‌జెట్ విమానాల్లో త‌లెత్తాయి. ఒక‌సారి, విమానం ఆకాశంలో ఉండగా, క్యాబిన్‌లో నుంచి పొగ‌లు వ‌చ్చాయి. మ‌రో సంద‌ర్భంలో విండ్ షీల్డ్‌లో ప‌లుగును గుర్తించారు. మరోసారి, ఫ్యుయ‌ల్ ఇండికేట‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య‌ను గుర్తించారు. ముందే ప‌రిష్క‌రించ‌ద‌గ్గ స‌మ‌స్య‌ల‌తో, ప్రయాణీకుల ప్రాణాల‌తో ఆడుకోవ‌డం స‌రికాద‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.

IPL_Entry_Point