Parliament session: కొనసాగుతున్న 50 గంటల ధర్నా.. గాంధీ విగ్రహం వద్దే నిద్ర-some suspended mps spend night in open near gandhi statue in parliament ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Some Suspended Mps Spend Night In Open Near Gandhi Statue In Parliament

Parliament session: కొనసాగుతున్న 50 గంటల ధర్నా.. గాంధీ విగ్రహం వద్దే నిద్ర

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 12:23 PM IST

ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ‘50 గంటల ధర్నా’ కొనసాగుతోంది.

పార్లమెంటు ఆవరణలో కొనసాగుతున్న ఎంపీల ధర్నా
పార్లమెంటు ఆవరణలో కొనసాగుతున్న ఎంపీల ధర్నా (HT_PRINT)

న్యూఢిల్లీ, జూలై 28: దోమలు, వేడిని తట్టుకోలేక సీపీఐకి చెందిన సంతోష్‌ కుమార్‌, ఆప్‌కి చెందిన సంజయ్‌ సింగ్‌తో సహా సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు ఎంపీలు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని గాంధీ విగ్రహం దగ్గర రాత్రంతా గడిపారు.

ట్రెండింగ్ వార్తలు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డోలా సేన్, శంతను సేన్ అర్ధరాత్రి వరకు నిరసన స్థలి వద్ద ఉన్నారు. 24 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. టెంట్‌కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఐదుగురు ఎంపీలు గాంధీ విగ్రహం వద్దే నిద్రపోయారు.

‘ప్రతిపక్ష ఎంపీల 50 గంటల నాన్ స్టాప్ ధర్నా. 21 గంటలు పూర్తయింది. మరో 29 గంటలు గడవాల్సి ఉంది.. 24 మంది ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయండి. చర్చించండి..’ అని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేశారు.

గురువారం ఉదయం ఎంపీలకు టీ తీసుకొచ్చిన టీఎంసీ ఎంపీ మౌసమ్ నూర్ మాట్లాడుతూ ప్రతిపక్ష ఎంపీలు క్షమాపణలు చెప్పబోరని, నిరసన కొనసాగుతుందని చెప్పారు.

ధరల పెరుగుదలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 20 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్ సభ సభ్యులు ఇప్పటివరకు సస్పెండయ్యారు.

కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీపై విరుచుకుపడ్డారు. ముర్ముకు జరిగిన అవమానాన్ని ఆమె ఆమోదించారని పేర్కొన్నారు.

కాగా అధ్యక్షుడు ముర్ము విషయంలో తాను పొరపాటున ‘రాష్ట్రపత్ని’ అనే పదాన్ని ఉపయోగించానని, అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా చిలువలు పలువలు చేసేందుకు ప్రయత్నిస్తోందని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.

అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏఎన్ఐతో అన్నారు.

రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

IPL_Entry_Point