Gang rape on minor: స్నేహితుడితో గుడికెళితే.. ఈడ్చుకెళ్లి సామూహిక అత్యాచారం-six including two boys rape teenage girl in madhya pradesh 3 held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Six, Including Two Boys, Rape Teenage Girl In Madhya Pradesh 3 Held

Gang rape on minor: స్నేహితుడితో గుడికెళితే.. ఈడ్చుకెళ్లి సామూహిక అత్యాచారం

HT Telugu Desk HT Telugu
Sep 19, 2022 10:31 AM IST

Gang rape on minor: స్నేహితుడితో కలిసి గుడికెళ్లిన ఓ బాలికను ఎత్తుకెళ్లి సామూహిత అత్యాచారం జరిపారు.

మధ్యప్రదేశ్‌లో ఓ బాలికపై సామూహితక అత్యాచారం (ప్రతీాకత్మక చిత్రం)
మధ్యప్రదేశ్‌లో ఓ బాలికపై సామూహితక అత్యాచారం (ప్రతీాకత్మక చిత్రం) (HT_PRINT)

రేవా (మధ్యప్రదేశ్), సెప్టెంబరు 19: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు సహా ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

రేవా జిల్లా ప్రధాన కార్యాలయానికి 70 కిలోమీటర్ల దూరంలోని నైగర్హి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనిల్ సోంకర్ తెలిపారు.

ముగ్గురు నిందితుల అక్రమ భవన నిర్మాణాన్ని జిల్లా యంత్రాంగం కూల్చివేసిందని, నేరంలో పాల్గొన్న మరో ముగ్గురి విషయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తామని మరో అధికారి తెలిపారు.

బాధితురాలు తన స్నేహితుడితో కలిసి శనివారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లిందని, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో నలుగురు పురుషులు, ఇద్దరు మైనర్ బాలురు అక్కడికి చేరుకున్నారని ఏఎస్పీ తెలిపారు.

వారు బాలికను ఆమె స్నేహితుడి ముందు ఈడ్చుకెళ్లి, ఓ చెరువు సమీపంలో ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని తెలిపారు.

ఆమె, ఆమె స్నేహితుడు తమను విడిచిపెట్టమని వేడుకున్నా నిందితులు కనికరించలేదని సోంకర్ చెప్పారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత, వారు ఆమెను కొట్టి, ఆమె మొబైల్ ఫోన్, నగలను ఎత్తుకెళ్లారు. పారిపోయే ముందు ఆమెను బెదిరించారు.

బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్‌ 376 (డి) (గ్యాంగ్‌రేప్), 395 (దోపిడీ), 506 (బెదిరింపులు), లైంగిక సంబంధాల నుండి పిల్లల రక్షణ నేరాల (పోక్సో) చట్టం సెక్షన్‌ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇతర నిందితుల కోసం వేట కొనసాగుతోందని, ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసు అధికారి తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్