Germany Church Shooting: కాల్పులతో దద్ధరిల్లిన జర్మనీ చర్చ్
Germany Church Shooting: జర్మనీలోని హంబర్గ్ (Hamburg) పట్టణంలో ఉన్న చర్చ్ లో ఒక దుండగుడు తుపాకీతో వీరంగం సృష్టించాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Germany Church Shooting: జర్మనీలోని హంబర్గ్ (Hamburg) లో ఉన్న జెహోవాస్ చర్చ్ (Jehovah's Church) లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జెవోహాస్ చర్చ్ లోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Germany Church Shooting: కారణం తెలియలేదు..
ఈ దారుణానికి ఒక వ్యక్తే పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆ దుండగుడి కాల్పుల్లో (Germany Church Shooting) 8 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఒక గర్భిణీ కూడా ఉందని స్థానిక పత్రిక ‘బిల్డ్’ తెలిపింది. మృతుల సంఖ్యను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ కాల్పులకు కారణం కూడా ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమకు చర్చ్ (Jehovah's Church) సమీపంలోని స్థానికుల నుంచి సమాచారం వచ్చిందని, చర్చ్ లో నుంచి కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయని అక్కడి స్థానికులు చెప్పడంతో వెంటనే చర్చ్ (Jehovah's Church) వద్దకు వెళ్లామని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నామని వివరించారు. అయితే, కాల్పులకు పాల్పడిన వ్యక్తి వివరాలను కానీ, మృతులు, బాధితుల వివరాలను కానీ పోలీసులు వెల్లడించలేదు.
Germany Church Shooting: చాన్సెలర్ దిగ్బ్రాంతి
ఈ ఘటనపై జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ షోల్జ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది దారుణమైన హింసాత్మక ఘటన అని, మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ప్రకటించారు. ఒలాఫ్ షోల్జ్ గతంలో రేవు పట్టణమైన హంబర్గ్ (Hamburg) కు మేయర్ గా కూడా వ్యవహరించారు. దేశ ప్రజలను షాక్ కు గురిచేసిన ఈ దారుణంపై సాధ్యమైనంత వేగంగా దర్యాప్తు పూర్తి చేస్తామని జర్మనీ హోం మంత్రి నాన్సీ ఫేజర్ ప్రకటించారు.