RBI Repo Rate : సెన్సెక్స్ 250 పాయింట్లు అప్-sensex up 205 points after rbi increases policy repo rate ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sensex Up 205 Points After Rbi Increases Policy Repo Rate

RBI Repo Rate : సెన్సెక్స్ 250 పాయింట్లు అప్

HT Telugu Desk HT Telugu
Jun 08, 2022 10:56 AM IST

ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన కొద్దిసేపటి వరకు నష్టాల్లో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు తిరిగి కొద్దిసేపటికే లాభాల బాట పట్టాయి.

స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు (REUTERS)

ముంబై, జూన్ 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిన మేరకు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ 4.9 శాతానికి పెంచింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కొద్దిగా నెగెటివ్‌గా ట్రెండైనట్టు కనిపించినప్పటికీ.. కొద్దిసేపటికే లాభాల బాట పట్టాయి.

ట్రెండింగ్ వార్తలు

ఉదయం 10.48 సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 55,316 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 65.90 పాయింట్లు బలపడి 16,482 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

అయితే టెలికాం, హెల్త్‌కేర్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జీటీఎల్ ఇన్ఫ్రా 4.83 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.17 శాతం, ఎంటీఎన్ఎల్ 0.70 శాతం నష్టపోయాయి.

హెల్త్ కేర్ సెక్టార్‌లో మెట్రోపొలిస్ ల్యాబ్ 2.65 శాతం, మాక్స్ హెల్త్ కేర్ 2.49 శాతం, ఎన్‌జీఎల్ ఫైన్ కెమ్ 1.99 శాతం నష్టపోయాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్ తదితర స్టాక్స్ నిలిచాయి.

నష్టపోయిన స్టాక్స్ జాబితాలో యూపీఎల్, సిప్లా, రిలయన్స్, బ్రిటానియా, భారతీ ఎయిర్ టెల్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్స్, మారుతీ సుజుకీ, శ్రీ సిమెంట్స్, ఎం అండ్ ఎం తదితర స్టాక్స్ ఉన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్