Dollar rate today : రూపాయి ఆల్‌టైమ్ రికార్డు.. 78.29కి పతనం
రూపాయి మరోసారి జీవితకాలపు కనిష్టాన్ని నమోదు చేసింది. డాలరుతో పోల్చితే రూపాయి విలువ శుక్రవారం 77.93కు పడిపోగా, సోమవారం ఏకంగా 78.29కి జారుకుంది.
రూపాయి విలువ మరోసారి జీవితకాలపు కనిష్టానికి పతనమైంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో 36 పైసలు బలహీనపడి డాలరుతో పోలిస్తే ఒక డాలరుకు రూ. 78.29గా మారకం విలువగా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
శుక్రవారం రోజే 19 పైసలు బలహీనపడి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన రూపాయి డాలరుతో పోలిస్తే 77.93లకు పడిపోయింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్భణం రేట్లు పెరగడం, విదేశీ సంస్తాగత ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి నిధులు మళ్లించడం తదిర అంశాలు ఫారెక్స్ మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి.
సోమవారం ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ వద్ద రూపాయి విలువ ఏకంగా 78.29కి పడిపోయింది. అంటే క్రితం రోజు ముగింపు 77.93 తో పోలిస్తే 36 పైసలు బలహీనపడింది.
సోమవారం దేశీయ మార్కెట్లు కూడా భారీ పతనాన్ని చవిచూస్తుండడంతో సాయంత్రానికి రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా రూపాయి వరుస పతనం భారత ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. చమురు ధరలు విపరీతంగా పెరిగినందున, దీనికి విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుల కారణంగా రూపాయి మరింత బలహీనపడుతూ వస్తోంది.
సంబంధిత కథనం