Rupee falls: 81.47కు పడిపోయిన రూపాయి.. 82 దిశగా అడుగులు
Rupee falls: రూపాయి విలువ డాలరుతో పోల్చితే 81.47కు పడిపోయింది.
Rupee falls to all-time low: రూపాయి విలువ మరోసారి జీవిత కాలపు కనిష్టానికి పడిపోయింది. సోమవారం ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో డాలరుతో పోల్చితే రూపాయి విలువ 81.47కు పడిపోయింది. ఇది క్రమంగా 82కు పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచడంతో ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపరులు ఈక్విటీలను తెగనమ్ముతుండడంతో సెంటిమెంట్ దెబ్బతిని రూపాయి విలువ పడిపోతోంది. డాలర్ ఇండెక్స్ గరిష్టస్థాయికి చేరుకోవడంతో మదుపరుల దృష్టి డాలర్లపై పడింది.
రూపాయి విలువ శుక్రవారం రికార్డు కనిష్ట స్థాయి 81.2250కి పడిపోయింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించడం రూపాయి విలువ మరింత నష్టపోకుండా ఉండడానికి దోహదపడింది.
ఏషియా ట్రేడింగ్‌లో డాలర్ ఇండెక్స్ 114.50 పైన పెరిగింది. బ్రిటీష్ పౌండ్ పతనం, సురక్షితమైన డాలరు వైపు పెట్టుబడిదారులు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ పెరుగుతూ వస్తోంది.
రూపాయి విలువ పడిపోతుండడంతో దేశంపై ఎగుమతుల భారం మరింత పెరుగుతుంది. అమెరికా వెళ్లే విద్యార్థులపై మరింత భారం పడుతుంది.