అన్ని కమ్యూనిటీలకు కలిపి సమగ్ర జనాభా విధానం ఉండాలి: ఆర్ఎస్ఎస్-rss chief bats for comprehensive population policy applicable equally to all communities ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rss Chief Bats For Comprehensive Population Policy Applicable Equally To All Communities

అన్ని కమ్యూనిటీలకు కలిపి సమగ్ర జనాభా విధానం ఉండాలి: ఆర్ఎస్ఎస్

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 10:41 AM IST

నాగ్‌పూర్, అక్టోబరు 5: భారతదేశం సమగ్ర ఆలోచనతో రూపొందించిన జనాభా విధానాన్ని కలిగి ఉండాలని, అన్ని వర్గాలకు సమానంగా వర్తించేలా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం అన్నారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (PTI)

అన్ని వర్గాలకు సమానంగా వర్తించేలా సమగ్ర జనాభా విధానం ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దసరా ర్యాలీలో భగవత్ మాట్లాడుతూ, కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత ఒక ముఖ్యమైన అంశమని, దానిని విస్మరించరాదని అన్నారు. 

జనాభా అసమతుల్యత భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారితీస్తుందని ఆయన అన్నారు. కొత్త జనాభా విధానాన్ని సమతూకం చేసేందుకు అన్ని వర్గాలకు సమానంగా వర్తింపజేయాలన్నారు. 

‘ఈ దేశంలోని వర్గాల మధ్య సమతుల్యత ఉండాలి..’ అని అన్నారు. చైనా యొక్క ‘ఒక కుటుంబం ఒక బిడ్డ’ విధానాన్ని ఎత్తి చూపుతూ ‘మనం జనాభాను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చైనాలో ఏమి జరిగిందో చూడాలి. ఆ దేశం ఒకే బిడ్డ పాలసీకి వెళ్లి ఇప్పుడు వృద్ధాప్య దేశంగా మారుతోంది. భారత్‌లో 57 కోట్ల మంది యువత ఉన్నందున వచ్చే 30 ఏళ్లపాటు మనం యువ దేశంగా కొనసాగుతాం..’ అని భగవత్ అన్నారు.

‘అయితే, 50 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఏమి జరుగుతుంది? జనాభాకు సరిపడా ఆహారం మనకు లభిస్తుందా’ అని ఆలోచించాలని అన్నారు. ప్రజలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాలని, ప్రభుత్వ ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకూడదని భగవత్ నొక్కి చెప్పారు.

‘అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి 30 శాతం జనాభా మాత్రమే కవర్ అవుతుంది. మరింత ఉపాధిని సృష్టించడానికి మిగిలిన జనాభా వారి సొంత వ్యాపారాలను ప్రారంభించవలసి ఉంటుంది..’ అని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్వతారోహకుడు సంతోష్ యాదవ్‌ను ఆహ్వానించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ప్రపంచంలోనే తొలి మహిళగా ఆమె పేరుగడించింది.

IPL_Entry_Point