RBI recruitment: ఆర్బీఐ లో ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్; లాస్ట్ డేట్ వివరాలు..-rbi to recruit 25 pharmacist posts apply at rbiorgin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rbi To Recruit 25 Pharmacist Posts, Apply At Rbi.org.in

RBI recruitment: ఆర్బీఐ లో ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్; లాస్ట్ డేట్ వివరాలు..

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 06:09 PM IST

RBI recruitment: ఫార్మసిస్ట్ ల భర్తీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India RBI) నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

RBI recruitment: ఫార్మసిస్ట్ ల భర్తీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India RBI) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 25 ఫార్మసిస్ట్ లను ఆర్బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్లో ఈ పోస్ట్ ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

RBI recruitment: ఆన్ లైన్ అప్లికేషన్

25 ఫార్మసిస్ట్ పోస్ట్ లను భర్తీ చేయడం కోసం ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గానూ అభ్యర్థులు rbi.org.in. వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 10, 2023. ఈ పోస్ట్ కు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డీ ఫార్మసీ (Diploma in Pharmacy) చేసి ఉండాలి. అప్లికేషన్లను విద్యార్హతలు, అనుభవం తదితర అంశాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తరువాత, ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయడానికి ఆర్బీఐ డిస్పెన్సరీ నుంచి అభ్యర్థుల నివాసం ఉన్న దూరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూ అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

IPL_Entry_Point

టాపిక్