'Maa Bharati Ke Sapoot' : అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేయడం కోసం ఒక వెబ్ సైట్-rajnath singh launches website for citizens to contribute to martyrs families ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rajnath Singh Launches Website For Citizens To Contribute To Martyrs' Families

'Maa Bharati Ke Sapoot' : అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేయడం కోసం ఒక వెబ్ సైట్

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 10:50 PM IST

website for citizens to contribute to martyrs' families: యుద్ధం, ఇతర పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన సాయుధ దళాల సైనికుల కుటుంబాలకు సాధారణ పౌరులు సాయం అందించాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

‘మా భారత్ కే సపూత్’ పోర్టల్ ను ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్
‘మా భారత్ కే సపూత్’ పోర్టల్ ను ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ (source: Twitter/@rajnathsingh)

సాయుధ పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాల సైనికులకు సాధారణ పౌరులు ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా ఒక వెబ్ సైట్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

website for citizens to contribute to martyrs' families: మా భారత్ కే సపూత్(Maa Bharati Ke Sapoot- MBKS)

మా భారత్ కే సపూత్ (Maa Bharati Ke Sapoot) పేరుతో ఈ పోర్టల్ ను రూపొందించారు. Armed Forces Battle Casualties Welfare Fund (AFBCWF)లో భాగంగా ఈ పోర్టల్ పని చేస్తుంది. త్రివిధ దళాల్లోని సైనికులు కార్యక్షేత్రంలో మరణిస్తే.. వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.

website for citizens to contribute to martyrs' families: సాధారణ పౌరులు కూడా..

ఈ Maa Bharati Ke Sapoot పోర్టల్ ను శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ వెబ్ సైట్లోకి వెళ్లి సాధారణ పౌరులు కూడా సాయుధ దళాల్లోని అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించవచ్చు. AFBCWF త్రివిధ దళాల్లోని సైనికులు యుద్ధంలో మరణించినా, తీవ్రంగా గాయపడినా, వెంటనే వారికి ఆర్థిక సాయం అందించడం కోసం ఏర్పాటైంది. ఈ ఫండ్ కు ఆర్థిక సాయం అందించాలని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక వీడియో సందేశంలో కోరారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ గుడ్ విల్ అంబాసడర్ గా ఉన్నారు.

IPL_Entry_Point