Rajasthan teacher`s gender change surgery: స్టుడెంట్ తో పెళ్లి కోసం లింగమార్పిడి-rajasthan teacher undergoes gender change surgery to marry student
Telugu News  /  National International  /  Rajasthan Teacher Undergoes Gender Change Surgery To Marry Student
ఆరవ్(మీరా), కల్పన దంపతులు
ఆరవ్(మీరా), కల్పన దంపతులు

Rajasthan teacher`s gender change surgery: స్టుడెంట్ తో పెళ్లి కోసం లింగమార్పిడి

08 November 2022, 22:04 ISTHT Telugu Desk
08 November 2022, 22:04 IST

Rajasthan teacher`s gender change surgery: తన విద్యార్థినితో పెళ్లి కోసం రాజస్తాన్ లోని ఒక టీచర్ లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇరు కుటుంబాల అనుమతితో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.

Rajasthan teacher`s gender change surgery: రాజస్తాన్ లోని భరత్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ తన స్టుడెంట్ తో ప్రేమలో పడింది. వారిద్దరి జెండర్ లు ఒకటే కావడంతో, ఆ టీచర్ జెండర్ చేంజింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు.

Rajasthan teacher`s gender change surgery: ఫిజికల్ ట్రైనింగ్ టీచర్

వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్ లోని భరత్ పూర్ కు చెందిన మీరా ఒక పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ టీచర్. ఆమె స్టుడెంట్ కల్పన మంచి కబడీ ప్లేయర్. మీరా ట్రైనింగ్ లో కబడ్డీలో కల్పన మరింత రాటు తేలింది. గత ఐదేళ్లలో వారి మధ్య గురు శిష్య సంబంధం ప్రేమగా మారింది. దాంతో, తన స్టుడెంట్ కల్పనతో పెళ్లి కోసం లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారాలని మీరా నిర్ణయించుకుంది.

Rajasthan teacher`s gender change surgery: ఢిల్లీ డాక్టర్..

దాంతో, లింగ మార్పిడికి సంబంధించిన సమాచారం కోసం నెట్ ను గాలించారు. చివరకు ఢిల్లీకి చెందిన ఒక డాక్టర్ ను సంప్రదించారు. 2019 లో ట్రీట్ మెంట్ ప్రారంభమైంది. ఫైనల్ సర్జరీ 2021లో సక్సెస్ ఫుల్ గా ముగిసింది.

Rajasthan teacher`s gender change surgery: మీరా నుంచి ఆరవ్ కుమార్

సర్జరీ అనంతరం మీరా పేరు ఆరవ్ కుమార్ గా మారింది. అనంతరం, రెండు కుటుంబాలు వీరి వివాహానికి అంగీకరించడంతో ఈ ఆదివారం వారిద్దరి వివాహం జరిగింది. ఆరవ్ సపోర్ట్ తోనే తాను కబడ్డీలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించగలిగానని కల్పన చెప్పారు. మీరా ను తానుప్రేమించానని, ఒకవేళ తను లింగమార్పిడి సర్జరీ చేసుకోకపోయినా.. తనను పెళ్లి చేసుకునేదాన్నని తెలిపింది. మీరా కూడా చిన్నప్పటి నుంచి అబ్బాయిలానే పెరిగిందని ఆరవ్ తండ్రి బీరీ సింగ్ వెల్లడించారు.