Rahul Gandhi's security breached: భారత్ జోడో యాత్రలో భద్రత వైఫల్యం
Rahul Gandhi's security breached: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భద్రత వైఫల్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర పంజాబ్ లో కొనసాగుతోంది.
Rahul Gandhi's security breached: పంజాబ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భద్రత వైఫల్యం చోటు చేసుకుంది. పంజాబ్ లోని తాండ నుంచి మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభమైంది.
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi's security breached: హోషియార్ పూర్ లో..
పంజాబ్ లోని హోషియార్ పూర్ లో భారత్ జోడో యాత్ర జరిగింది. యాత్ర కొనసాగుతుండగా, ఒక్కసారిగా రాహుల్ గాంధీ వైపుకు దూసుకువచ్చిన ఒక యువకుడు, రాహుల్ ను ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ, పార్టీ కార్యకర్తలు ఆ యువకుడిని పక్కకు లాగేశారు. అనంతరం, భద్రత బలగాలు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆరెంజ్ కలర్ జాకెట్ వేసుకున్న ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి రాహుల్ గాంధీని హత్తుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పంజాబ్ లో జరుగుతున్న యాత్రలో రాష్ట్రంలో పార్టీ సీనియర్ నేతలు అమరిందర్ సింగ్ రాజా వారింగ్, హరిష్ చౌధరి, రాజ్ కుమార్ ఛబ్బేవాల్ తదితరులు రాహుల్ గాంధీతో పాటు కలిసి నడుస్తున్నారు.
Rahul Gandhi's security breached: అత్యుత్సాహంతో..
ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటనను తేలిగ్గా తీసుకున్న రాహుల్ గాంధీ.. ఆ యువకుడు అత్యుత్సాహంతో అలా వ్యవహరించాడని వ్యాఖ్యానించారు. అది భద్రతావైఫల్యంగా భావించడం లేదన్నారు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ తన వైపు రావడం మాత్రమే తాను చూశానన్నారు.