Crime : భార్యతో అక్రమ సంబంధం.. పోలీసు ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి!-pak cop s nose lips mutilated by husband for having affair with his wife ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pak Cop's Nose, Lips Mutilated By Husband For Having Affair With His Wife

Crime : భార్యతో అక్రమ సంబంధం.. పోలీసు ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి!

Sharath Chitturi HT Telugu
Aug 02, 2022 07:36 AM IST

Pakistan crime news : తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో.. ఓ పోలీసు ముక్కు, చెవులు కోసేశాడు ఓ వ్యక్తి. ఈ విషయం పాకిస్థాన్​లో కలకలం సృష్టించింది.

భార్యతో అక్రమ సంబంధం.. పోలీసు ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి!
భార్యతో అక్రమ సంబంధం.. పోలీసు ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి! (AP/Representative image)

Pakistan crime news : తన భార్యను బలవంతంగా అక్రమ సంబంధంలోకి దింపినందుకు.. ఓ పోలీసు కానిస్టేబుల్​ ముక్కు, చెవులు, పెదాలు కోసేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన పాకిస్థాన్​ పంజాబ్​ రాష్ట్రంలో జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

కిడ్నాప్​ చేసి..

ఇఫ్తిఖర్​​ అనే వ్యక్తి.. తన భార్య, పిల్లలతో కలిసి పంజాబ్​ రాష్ట్రంలో జీవిస్తున్నాడు. కాగా.. నెల రోజుల క్రితం హయత్​ అనే కానిస్టేబుల్​పై పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు.

"నా భార్యను హయత్​ వేధిస్తున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకోవాలని బెదిరిస్తున్నాడు. లేకపోతే నా కొడుకుని చంపేస్తాను అని అంటున్నాడు. ఓసారి.. నా భార్య హయత్​ను కలిసింది. బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేశాడు. ఆ వీడియో తీసి, బెదిరించడం మొదలుపెట్టాడు," అని ఫిర్యాదులో ఇఫ్తిఖర్​ పేర్కొన్నారు.

ఇఫ్తిఖర్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఈలోపు.. కానిస్టేబుల్​ హయత్​పై ప్రతీకారం తీర్చుకున్నాడు ఇఫ్తికర్​. పక్కా ప్రణాళిక రచించి.. హయత్​ను కిడ్నాప్​ చేశాడు. ఇందుకోసం అతడికి 12మంది సాయం చేశారు!

ఎవరూ లోని ప్రదేశానికి తీసుకెళ్లి.. హయత్​ను ఇఫ్తిఖర్​ చిత్రహింసలకు గురిచేశాడు. పదునైన ఆయుధాలతో హయత్​ చెవులు, ముక్కు, పెదాలతో పాటు ఇతర శరీర భాగాలను కోసేశాడు.

తీవ్ర గాయలతో పడి ఉన్న హయత్​ను కొందరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్​ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఇఫ్తిఖర్​ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం