Omar not to contest assembly polls: ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ పోటీ చేయడు’’-omar not to contest assembly polls if j k s statehood not restored farooq ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Omar Not To Contest Assembly Polls If J-k's Statehood Not Restored: Farooq

Omar not to contest assembly polls: ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ పోటీ చేయడు’’

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 10:13 PM IST

Omar not to contest assembly polls: త్వరలో జమ్మూకశ్మీర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ చేయడని ఆ పార్టీ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా వెల్లడించారు.

నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫారూఖ్ అబ్దుల్లా (ఫైల్ ఫొటో)
నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫారూఖ్ అబ్దుల్లా (ఫైల్ ఫొటో) (PTI)

Omar not to contest assembly polls: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పు తదితర కీలక పరిణామాల అనంతరం జమ్మూకశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Omar not to contest assembly polls: ఒమర్ పోటీ చేయడం లేదు

అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీ చేయరని, ఆయన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా ను మళ్లీ ఇచ్చే వరకు ఒమర్ ఎన్నికల్లో పోటీ చేయడని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలో ఒమర్ ఒకసారి చెప్పారని, పార్టీ తరఫున ఇప్పుడు తాను చెబుతున్నానని బుద్గాం జిల్లాలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గన్న సందర్భంగా ఫారూఖ్ అబ్దుల్లా వివరించారు.

Omar not to contest assembly polls: పార్టీ కార్యకర్తల కోసం..

పార్టీ కార్యకర్తలను క్రియాశీలకంగా ఉంచడం కోసం నియోజక వర్గాల వారీగా ఇన్ చార్జిలను నియమిస్తున్నామని ఫారూఖ్ తెలిపారు. తద్వారా ప్రజా సమస్యల గురించి తెలుసుకుని, వాటిపై పోరాటం చేయడానికి వీలవుతుందని వివరించారు. ఈ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లే భవిష్యత్తులో పార్టీ తరఫున అభ్యర్థులు అవుతారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

IPL_Entry_Point