NHPC Limited recruitment: ఎన్‌హెచ్‌పీసీలో 401 పోస్టులు.. దరఖాస్తు చేయండిలా
PC Limited recruitment: ఎన్‌హెచ్‌పీసీలో 401 పోస్టులు భర్తీ కాబోతున్నాయి. అర్హతలు, ఇతర వివరాల కోసం ఇక్కడ చూడండి.
ప్రభుత్వ రంగంలోని మినీ రత్న కంపెనీ అయిన ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ లిమిటెడ్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైనీ ఇంజినీర్, ట్రైన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 25తో ముగుస్తుంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఎన్‌హెచ్‌పీసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ ఖాళీలు ఇవే
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ 401 పోస్టులు భర్తీ చేయనుంది. ట్రైనీ ఇంజినీర్ (సివిల్) పోస్టులు 136, ట్రైనీ ఇంజినీర్ ఎలక్ట్రికల్ పోస్టులు 41, ట్రైనీ ఇంజినీర్ మెకానికల్ పోస్టులు 108, ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్స్ పోస్టులు 99 భర్తీ చేయనుంది. అలాగే ట్రైనీ ఆఫీసర్ (హెచ్‌ఆర్) పోస్టులు 14, ట్రైనీ ఆఫీసర్ లా పోస్టులు 3 భర్తీ చేయనుంది.
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వయో పరిమితి:
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు వయో పరిమితి జనవరి 25, 2023 నాటికి 30 ఏళ్లు దాటకూడదు.
ఎంపిక ప్రక్రియ ట్రైనీ ఇంజినీర్ సివిల్, ట్రైనీ ఇంజినీర్ ఎలక్ట్రికల్, ట్రైనీ ఇంజినీర్ మెకానికల్ పోస్టులకు గేట్-2022 ర్యాంకుల ఆధారంగా ఉంటుంది. ఇక ట్రైనీ ఫైనాన్స్ ఆఫీసర్ అయితే సీఏ, సీఎంఏ ఇంటర్మీడియెట్, ఫైనల్ అగ్రిగేట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది.
ట్రైనీ ఆఫీసర్ హెచ్ఆర్ అయితే అభ్యర్థులు యూజీసీ నెట్ డిసెంబరు 2021, జూన్ 2022 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇక ట్రైనీ ఆఫీసర్ (లా) పోస్టులకైతే సెలెక్షన్ ప్రాసెస్ క్లాట్ 2022 ఎగ్జామినేషన్ (ఎల్ఎల్ఎం, పీజీ కోర్సుల అడ్మిషన్) ఆధారంగా ఉంటుంది.
సమగ్ర నోటిఫికేషన్ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.