Woman gang-raped in MP: మహిళపై సామూహిక అత్యాచారం
Woman gang-raped in MP: మధ్యప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఒక యువతిని ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు.
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. నవరాత్రి సందర్భంగా దుర్గా మాత మండపానికి వెళ్లి, తిరిగివస్తున్న యువతిని బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
Woman gang-raped in MP: పూజ చేసి వస్తుండగా..
రేవా జిల్లాలోని హనుమాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 19 ఏళ్ల బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపానికి వెళ్లింది. కుటుంబసభ్యులు తిరిగి వెళ్లిపోయారు. కానీ స్నేహితురాళ్లతో ఉన్న ఆ యువతి అక్కడే కాసేపుండి బయల్దేరింది. దారిలో ఆ యువతికి వరుసకు బావ అయ్యే వ్యక్తి, మరో ఐదుగురు ఆ యువతిని వేధించడం ప్రారంభించారు.
Woman gang-raped in MP: సామూహిక అత్యాచారం
కాసేపటికి, ఆ యువతి గట్టిగా ఎదురు తిరగడంతో, బలవంతంగా ఆ యువతిని దగ్గర్లోని చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. అనంతరం, ఆ ఘటనను వీడియో తీసి, ఆ యువతి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించారు.
Woman gang-raped in MP: పోలీసు కేసు..
అనంతరం బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇద్దరు మైనర్లు సహా నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, నిందితుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చేశారు. అవి అక్రమంగా నిర్మించిన ఇళ్లు అని, అందువల్లనే కూల్చేశామని అధికారులు తెలిపారు.