kid's complaint on mother : ‘అమ్మ నా చాక్లెట్లు దొంగలిస్తోంది.. అరెస్ట్​ చేయండి’-mom steals my chocolates put her in jail this kid s complaint will melt your heart ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mom Steals My Chocolates, Put Her In Jail: This Kid's Complaint Will Melt Your Heart

kid's complaint on mother : ‘అమ్మ నా చాక్లెట్లు దొంగలిస్తోంది.. అరెస్ట్​ చేయండి’

Sharath Chitturi HT Telugu
Oct 18, 2022 06:30 AM IST

kid's complaint on mother : ‘అమ్మ నన్ను చాక్లెట్లు తిననివ్వడం లేదు. అరెస్ట్​ చేయండి,’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ 3ఏళ్ల బాలుడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

పోలీసుకు ఫిర్యాదు చేస్తున్న చిన్నారి
పోలీసుకు ఫిర్యాదు చేస్తున్న చిన్నారి

kid's complaint on mother : చిన్న పిల్లలు ఏం చేసినా సరదగా ఉంటుంది. వారి అమాయక చేష్టలు మన ముఖాల్లో చిరునవ్వును తెప్పిస్తాయి. తాజాగా.. మధ్యప్రదేశ్​ బుర్హన్​పూర్​ జిల్లా డేధ్​తలై గ్రామంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అమ్మ చాక్లెట్లు తిననివ్వడం లేదని, ఆమెను అరెస్ట్​ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ బాలుడు.

'ప్లీజ్​.. మా అమ్మను అరెస్ట్​ చేయండి..'

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఆ బాలుడి వయస్సు 3ఏళ్లు. అతడి తండ్రి.. బాలుడిని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లాడు. అక్కడ.. బాలుడు, తన తల్లి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చుట్టు పక్కన ఉన్న పోలీసులు తెగ నవ్వుకున్నారు. ఓ పోలీస్​ కానిస్టేబుల్​.. అతని ఫిర్యాదును సీరియస్​గా రాసుకుంటున్నట్టు వీడియోలో కనిపించింది.

Burhanpur viral video : "మా అమ్మ నా చాక్లెట్లు దొంగలిస్తోంది. నన్ను తిన నివ్వడం లేదు. చాక్లెట్లు అడిగితే నన్ను కొడుతోంది. మీరు ఆమెను అరెస్ట్​ చేయండి," అని చెప్పుకొచ్చాడు ఆ బాలుడు.

నెట్టింట వీడియో వైరల్​..

"స్నానం చేసిన తర్వాత బాలుడి కళ్లకు తల్లి కాటుక రాస్తోంది. కానీ అటు ఇటు తిరిగాడు. చాక్లెట్లు కావాలని మారాం చేశాడు. అప్పుడు అతని తల్లి సరదాగా కొట్టింది. వెంటనే నా దగ్గరికి వచ్చాడు. పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లాలని, అమ్మపై ఫిర్యాదు చేయాలని చెప్పాడు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చా," అని బాలుడి తండ్రి చెప్పుకొచ్చాడు.

child complaints about his mother : "బాలుడి ఫిర్యాదు చూసి అందరు నవ్వుకున్నాము. ఆ తర్వాత అతడికి నచ్చజెప్పాము. అమ్మకి ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని చెప్పి, తిరిగి ఇంటికి పంపించాము," అని ఎస్​ఐ ప్రియాంక నాయక్​ తెలిపారు.

ఈ వార్త నెట్టింట వైరల్​ అయ్యింది. విన్న వారందరు, బాలుడి చేష్టలు చూసిన వారందరు తెగ నవ్వేసుకుంటున్నారు. చిన్న నాటి రోజులు గుర్తొస్తున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం