Minor gang-raped by 8 men : మైనర్ గర్ల్ పై గ్యాంగ్ రేప్-minor gang raped by 8 men in rajasthan s alwar video made viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Minor Gang-raped By 8 Men In Rajasthan's Alwar, Video Made Viral

Minor gang-raped by 8 men : మైనర్ గర్ల్ పై గ్యాంగ్ రేప్

HT Telugu Desk HT Telugu
Sep 30, 2022 02:40 PM IST

Minor gang-raped by 8 men : 8 మంది దుండగులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్తాన్ లో సంచలనం సృష్టించింది. రేప్ ఘటనను ఫోన్ లో చిత్రీకరించి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి రూ. 50 వేల వరకు డబ్బు తీసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Minor gang-raped by 8 men : రాజస్తాన్ లోని అల్వార్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితులంతా 20, 22 ఏళ్ల వయస్సు వారే. వారిలో ప్రధాన నిందితుడు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ, గత ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. అలాగే, ఆమె నుంచి డబ్బు తీసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Minor gang-raped by 8 men : బ్లాక్ మెయిల్

స్థానికంగా 8వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక ప్రైవేటు ఫొటోలను సంపాదించిన సాహిల్ అనే ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఒక రోజు తాను చెప్పిన చోటుకు రానట్లయితే, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. భయపడిపోయిన ఆ బాలిక అతడు చెప్పిన ప్రాంతానికి వచ్చింది. అక్కడ ప్రధాన నిందితుడితో పాటు 8 మంది ఆ బాలికపై అత్యాచారం జరిపారు. ఆ అత్యాచార ఘటనను కూడా ఫోన్ లో వీడియో తీసి, ఆ బాలికను బెదిరించడం ప్రారంభించారు.

Minor gang-raped by 8 men : రూ. 50 వేలు..

ప్రధాన నిందితుడైన సాహిల్ ఆ బాలికను బెదిరించి రూ. 50 వేల వరకు ఆ అమ్మాయి నుంచి తీసుకున్నాడు. ఒక సమయంలో ఆ బాలిక డబ్బు ఇవ్వలేకపోవడంతో, ఆ వీడియోను స్థానిక వాట్సాప్ గ్రూప్ ల్లో పోస్ట్ చేశాడు. అనంతరం, ఆ బాలిక సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులపై సంబంధిత ఐపీసీ, పొక్సొ చట్టాల్లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

IPL_Entry_Point