‘మీషో’లో ఇక కిరాణా సామాగ్రి కూడా కొనొచ్చు..-meesho to integrate grocery business in core app to scale to 12 states this year ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Meesho To Integrate Grocery Business In Core App; To Scale To 12 States This Year

‘మీషో’లో ఇక కిరాణా సామాగ్రి కూడా కొనొచ్చు..

HT Telugu Desk HT Telugu
Apr 05, 2022 12:29 PM IST

మీషో ఇ-కామర్స్ సంస్థ.. భారతదేశంలో బిలియన్ వినియోగదారుల కోసం ఒకే షాపింగ్ గమ్యస్థానంగా మారాలన్న లక్ష్యంతో తన కిరాణా వ్యాపారాన్ని కోర్ యాప్‌లో ఇంటిగ్రేట్ చేయనున్నట్టు మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు ఫ్యాషన్ తదితర రంగాలకు పరిమితమైన మీ షో ఇకపై కిరాణా సామాను కూడా అందుబాటులోకి తేనుంది.

మీషో‌ ఈకామర్స్‌లో ఇకపై కిరాణా వస్తువులు కూడా కొనుగోలు చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
మీషో‌ ఈకామర్స్‌లో ఇకపై కిరాణా వస్తువులు కూడా కొనుగోలు చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం) (REUTERS)

మే మొదటి వారంలోగా కిరాణా వ్యాపారం ఇంటిగ్రేషన్ పూర్తి చేయాలని మీషో కంపెనీ భావిస్తోంది. దానిని ఫార్మిసో నుంచి మీషో సూపర్‌స్టోర్‌‌గా రీబ్రాండ్ చేయనుంది.

‘టైర్ 2 ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నందున ఆన్‌లైన్ గ్రోసరీకి డిమాండ్ పెరుగుతూనే ఉంది. మీషో సూపర్‌స్టోర్‌ను మా కోర్ యాప్‌తో అనుసంధానించడానికి మేం సంతోషిస్తున్నాం. కర్నాటకలో ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ఆరు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు దీనికి సానుకూల వాతావరణం ఉంది..’ అని మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే చెప్పారు.

మీషో సూపర్‌స్టోర్ ప్రస్తుతం తాజా పండ్లు, తాజా కూరగాయలు, కిరాణా సామాగ్రి, గృహ సంరక్షణ, ప్యాక్ చేసిన ఆహారం వంటి కేటగిరీల్లో 500 ఉత్పత్తులను అందిస్తోంది.

ఇప్పుడు కంపెనీ 100 మిలియన్లకు పైగా వినియోగదారులకు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో 36 కంటే ఎక్కువ కేటగిరీల్లో 87 మిలియన్ల క్రియాశీల ఉత్పత్తులను అందుబాటులోకి తెస్లుంది. 

మీషో ఆన్‌లైన్ కిరాణా సామగ్రి సరసమైన ధరల్లో అందుబాటులోకి తేవడానికి కర్ణాటకలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించింది. 9 నెలల కంటే తక్కువ సమయంలో, ఇది కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి 6 రాష్ట్రాలకు దాని కిరాణా వ్యాపారాన్ని విస్తరించనుంది.

‘పైలట్ ప్రాజెక్టు ఊపందుకోవడం కొనసాగిస్తున్నందున మీషో 2022 చివరి నాటికి 12 రాష్ట్రాల్లో సూపర్‌స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది’ అని కంపెనీ తెలిపింది.

IPL_Entry_Point